Tiger: నల్లమల అటవీ ప్రాంతంలో.. గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృత్యువాత..(వీడియో)

Updated on: Nov 20, 2021 | 8:46 AM

కర్నూలు జిల్లా నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గం చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగినట్లు అధికారులు తెలిపారు.


కర్నూలు జిల్లా నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గం చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న చలమ రేంజ్ అటవీ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నంద్యాల వైపు వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్లే పెద్దపులి చనిపోయినట్లు పేర్కొంటున్నారు. పులి క‌ళేబ‌రాన్ని అట‌వీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని.. కార్యాలయానికి తరలించారు. కాగా.. ఘటనపై ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అంతకు ముందు కూడా పలు ప్రాంతాల్లో వాహనాలు ఢీకొని అటవీ జంతువులు మరణించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో పులుల సంచారం పెరిగింది.

కాగా.. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. తాడ్వాయి అటవీ ప్రాంతం నుంచి కరకగూడెం అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..