Covidvaccines in medical shop: త్వరలో మెడికల్‌ షాప్‌లోకి కోవిడ్‌ వ్యాక్సిన్‌లు.! పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

|

Feb 10, 2022 | 9:47 AM

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో.. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల కంపెనీలు, రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి.


ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో.. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల కంపెనీలు, రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రెగ్యులర్‌ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్‌ వ్యాక్సిన్‌ల ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వ్యాక్సిన్‌ల ధరలు ఒక్కో డోసు 275 రూపాయలుగా నిర్ధారణ కానున్నట్టు తెలుస్తోంది. అదనంగా సర్వీస్‌ ఛార్జీ మరో 150 రూపాయలతో మొత్తంగా 425 రూపాయలు ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి. వీటిపై నేషనల్‌ ఫార్మాసుటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ ధరల నియంత్రణ తగ్గింపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోవిడ్-19పై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ కీలక సూచన చేసింది. కొన్ని షరతులకు లోబడి ఉపయోగించడానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌లకు సాధారణ మార్కెట్లోకి పర్మిషన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాగే ధరల నిర్ధారణపై NPPAను అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది.