పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. పాఠ్యాంశంగా కరోనా వైరస్.. వీడియో

Updated on: Sep 15, 2021 | 10:32 PM

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాగురించి పాఠ్యాంశంగా విద్యార్ధులకు అందించాలని నిర్ణయించింది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాగురించి పాఠ్యాంశంగా విద్యార్ధులకు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 11వ తరగతి విద్యార్థుల సిలబస్ లో కరోనా వైరస్ ను ఓ పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది. కరోనా వైరస్ పాఠ్యాంశాన్ని హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో బోధించనున్నారు. కరోనా పాఠ్యాంశాన్ని 6 నుంచి 10వ తరగతి వరకు బోధించాలన్న ప్రతిపాదనలు కూడా బెంగాల్ ప్రభుత్వం ముందున్నాయి. విద్యార్థులకు ఈ పాఠాల ద్వారా కరోనాపై మెరుగైన రీతిలో అవగాహన కలిగించేందుకు వీలవుతుందని, తద్వారా అనేక లాభాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముందస్తుగా నిర్ధారించడం సులభతరం అవుతుందని, వ్యాక్సినేషన్ పైన చైతన్యం వస్తుందని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ యోగిరాజ్ రాయ్ తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:గణేష్‌ ఉత్సవాలలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు.. వీడియో

Peacocks dead: చిత్తూరు జిల్లాలో ఐదు నెమళ్లు మృతి.. కుంట వద్ద పడి ఉన్న కళేబరాలు..

Loading...
Unable to load recommendations.
Follow Us