Viral Video: కోర్టు పర్మిషన్‌తో ప్రాణాలు వదిలిన మొదటి వ్యక్తి.. ఎందుకు..? ఎక్కడ..? మరిన్ని వివరాలు ఈ వీడియోలో

|

Feb 06, 2022 | 7:07 PM

కొలంబియాకు చెందిన ఓ వ్యక్తి కోర్టు అనుమతితో కారుణ్య మరణం పొందాడు. చనిపోవడానికి అవకాశం కల్పించమని కోరగా. కోర్టు అంగీకరించింది. ఆస్‌బెస్టాస్‌ పరిశ్రమలో చాలా కాలం పని చేసిన విక్టర్ ఎస్కో బార్ ఊపిరితిత్తుల సమస్య బారినపడ్డాడు.


కొలంబియాకు చెందిన ఓ వ్యక్తి కోర్టు అనుమతితో కారుణ్య మరణం పొందాడు. చనిపోవడానికి అవకాశం కల్పించమని కోరగా. కోర్టు అంగీకరించింది. ఆస్‌బెస్టాస్‌ పరిశ్రమలో చాలా కాలం పని చేసిన విక్టర్ ఎస్కో బార్ ఊపిరితిత్తుల సమస్య బారినపడ్డాడు. డయాబెటిస్, గుండె జబ్బులతో కూడా పోరాడుతున్నాడు. 24 గంటలు ఆక్సిజన్ పైపు సపోర్ట్‌తో వీల్ చెయిర్‌కే పరిమితం అయ్యాడు.దీంతో ఇలా బతికేకన్నా చనిపోవడం బెటర్ అని భావించాడు. ఆ విషయాన్ని ముందుగా ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించాడు.కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత కారుణ్య మరణం కోసం కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే కొలంబియాలో 1997 వరకు కారుణ్య మరణం శిక్షార్హమైన నేరం. తర్వాత ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ, ఆరు నెలలకు మించి బతికే అవకాశం లేని వాళ్లు కోర్టు పర్మిషన్‌తో చనిపోవచ్చని పేర్కొంది. రీసెంట్‌గా ఈ నిబంధనను ఇంకొంచెం సడలించింది. ఆరు నెలలకు మించి బతికే అవకాశం ఉన్నప్పటికీ దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతుంటే అలాంటివాళ్లు గౌరవంగా మరణించేందుకు అవకాశం ఇచ్చింది.దీంతో విక్టర్‌ కారుణ్య మరణానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన మెడికల్ రిపోర్టులు చూసిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో కుటుంబ సభ్యులు చూస్తుండగా డాక్టర్లు విక్టర్‌కు తొలుత మత్తు మందు ఇచ్చి, ఆపై సైనెడ్‌ను శరీరంలోకి ఇంజెక్ట్ చేశారు. దాంతో ఆయన ప్రాణాలు విడిచారు. కోర్టు పర్మిషన్‌తో కారుణ్య మరణం పొందిన తొలి వ్యక్తి విక్టర్ ఎస్కోబార్‌.

Published on: Feb 06, 2022 06:44 PM