Toothpaste: బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసమే..

Updated on: Nov 14, 2024 | 10:51 AM

ఉదయం నిద్రలేవగానే ప్రతీ ఒక్కరం మొదట చేసే పని బ్రష్‌ చేసుకోవడం. నోటి ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కేవలం ఉదయాన్నే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. నోటి ఆరోగ్యం, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా బ్రష్ చేసుకోవాల్సిందే.

బ్రషింగ్ విషయంలో మనలో కొందరు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటిలో ప్రధానమైంది టూత్ పేస్ట్‌. సాధారణంగా ఎక్కువ టూత్‌ పేస్ట్‌ వాడితే మంచిదని మనలో చాలా మంది భావిస్తుంటారు. ఇంతకీ టూత్ పేస్ట్‌ ఎక్కువగా వాడడం మంచిదేనా.?బ్రష్ చేయడానికి ఎంత టూత్ పేస్ట్ వాడాలి? ఈ విషయం గురించి బహుశా ఎవరూ.. ఎప్పుడూ ఆలోచించి ఉండరు. కానీ, ఆలోచించాలి. మోతాదుకు మించి పేస్ట్ వాడితే పళ్ల ఆరోగ్యం పాడవుతుంది. ఈ విషయం ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్’ జరిపిన అధ్యయనంలో తేలింది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఇదే చెబుతోంది. 3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలు బ్రష్ చేయడానికి బఠాణీ గింజ పరిమాణానికి మించి పేస్ట్ వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల బ్రష్‌లపై ఎక్కువ పేస్ట్ వేస్తుంటారు. కానీ, దానివల్ల చాలా దుష్పరిణామాలుంటాయి. అసలు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎంత టూత్‌ పేస్ట్‌ను వాడాలో చూద్దాం. టూత్‌పేస్ట్‌ ఎక్కువగా ఉపయోగించడం వల్ల లాభం ఉండకపోగా నష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బఠానీ గింజ పరిమాణం ఉంటే చాలని చెబుతున్నారు. ఇది మొత్తం దంతాలను శుభ్రం చేసుకోవడానికి సరిపోతుంది. అయితే టూత్ పేస్ట్‌ను ఎక్కువగా ఉపయోగించడం హానికరమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సాధారణంగా టూత్‌ పేస్టుల్లో సోడియం ఫ్లోరైడ్‌ను ఉపయోగిస్తారు. ఇది దంతాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే అధిక మొత్తంలో తీసుకుంటే సోడియం ఫ్లోరైడ్‌...