ఈ ఆకులను చీప్‌గా చూడొద్దు.. ఆ వ్యాధికి దివ్య ఔషధం..
వాము ఆకు (కర్పూరవల్లి) సాంప్రదాయకంగా దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలకు ఉపయోగిస్తారు. ఇది రోగనిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది షుగర్, రక్తపోటును నియంత్రించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఈ ఆకులను నమిలి లేదా టీ, కషాయాలుగా తీసుకోవచ్చు.
వాము ఆకు దీన్ని కర్పూరవల్లి అని కూడా పిలుస్తారు. ఇదొక సుగంధ మూలిక మొక్క, ఈ మొక్క ఆకులను సాంప్రదాయ వైద్యంలో దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, శ్వాసకోశ సమస్యలు వంటి వాటికి ఉపయోగిస్తారు. ఇందులో రోగ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. వాము ఆకు డయాబెటిక్ రోగులకు అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. వాము ఆకును తినడం ద్వారా షుగర్‌తో పాటు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. మధుమేహం ఉన్నవారిలో మలబద్ధకం ఒక సాధారణ సమస్య. వీరు వాము ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. అలాగే భేదిమందుగా కూడా పనిచేస్తుంది. ఇది కడుపును శుభ్రపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు డయాబెటిక్ రోగులను ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ఈ ఆకులను శుభ్రంగా కడిగి నమలవచ్చు. లేదంటే ఆకులతో టీ లేదా కషాయాలను తయారు చేసుకుని త్రాగవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
ఏలియన్స్‌కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !