ఒక మరణం ప్రభుత్వాన్ని గడగడలాడించింది. బెంగుళూరులో హై అలెర్ట్ ప్రకటించేలా చేసింది. అన్ని కార్యక్రమాలను ఆపేసి మరీ కన్నడ సీఎంనే రంగంలోకి దిగేలా చేసింది. ఆ మరణమే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ది. ఒక సినీ కళాకారుడు మరణిస్తే ప్రభుత్వం ఇంతలా ఎందుకు స్పందించింది.? ఇప్పుడిదే ప్రశ్న కొంత మంది నాన్ కన్నడ ప్రజల్లో కలుగుతోంది.
పునీత్ ది ఎంత గొప్ప మరణమంటే.. ఆయన మరణ వార్త చెప్పడానికి కర్ణాటక ప్రభుత్వమే భయపడిపోయేంత. పరీక్షలు రాసేవాళ్లను సైతం ఇళ్లకు పంపించేసింది. స్కూళ్లకు సెలవులిచ్చేసింది. కేంద్ర హోంశాఖను అడిగి కేంద్ర బలగాలను పంపించమని కోరి.. ఆ తర్వాతగానీ విషాద వార్త ప్రకటించలేదు. అంతటి పాపులర్ హ్యూమన్ బీయింగ్ పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్‌కుమార్ కన్నడ నాట పవర్ స్టార్, తన తండ్రి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ వారసత్వాన్ని నిలబెట్టిన స్టార్ హీరో. కన్నడ నాట నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అందుకే పునీత్ రాజ్ కుమార్ మరణించాడని తెలియగానే అభిమానులు బెంగుళూరుకు పోటెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించిన కన్నడ ప్రభుత్వం వారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంది.
అదీకాక పునీత్ సోషల్లీ ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్నో గ్రామాలను దత్తత తీసుకున్నారు. అనాథ ఆశ్రమాలు, స్కూళ్లు నడిపిస్తున్నారు. ఇలా సేవాగుణంలోనే స్టార్ అని అనిపించుకున్నారు. దీంతో ఆయన పార్ధీవ దేహాన్ని చూడడానికి ఎంతో మంది కంఠీరవ స్టేడియానికి తరలివస్తారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆరాటపడతారు. ఇలాంటి విషాదసమయాలలో మళ్లీ తొక్కిసలాంటి మరో ప్రమాదం జరుకుడదే ఉద్దేశంతోనే కన్నడ ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేసింది. అదీ కాక ఇలాంటి మహనీయుడి అంత్యక్రియలు ప్రభుత్వం ముందుండి చేయడం.. పునీత్‌కు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం.
మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…