Telangana: హమ్మయ్య..! కామారెడ్డి-నిజామాబాద్ మధ్య మొదలైన రైలు సర్వీసులు

Updated on: Aug 30, 2025 | 11:41 AM

కామారెడ్డి-నిజామాబాద్ మధ్య రైలు సర్వీసులు భారీ వర్షాల వల్ల ట్రాక్ దెబ్బతిన్న కారణంగా మూడు రోజులు నిలిచిపోయాయి. 40 ప్రైవేట్ రైళ్లతో పాటు 12 ప్రధాన రైళ్లు ప్రభావితమయ్యాయి. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి, రైలు సర్వీసులను పునఃప్రారంభించారు.

కామారెడ్డి – నిజామాబాద్ మధ్య రైలు సర్వీసులు భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. తిప్పాపూర్ వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో మూడు రోజుల పాటు 12 ప్రధాన రైళ్లు, 40 ప్రైవేటు రైళ్ల రాకపోకలు అంతరాయం చెందాయి. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి, డెమో రైలును నడిపించి, రైలు సర్వీసులను పునఃప్రారంభించారు. 36 గంటల పాటు సాగిన మరమ్మతుల తర్వాత, రైళ్లు యధావిధిగా నడుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా వరదల ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.