Rain Update: జమ్మూకశ్మీర్,తమిళనాడులో భారీ వర్షాలు

Updated on: Jan 03, 2026 | 2:15 PM

జమ్మూకశ్మీర్, తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. బారాముల్లాలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నీలగిరి జిల్లాలో కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభించింది. కూనూరు, ఊటీలో పర్యాటకులను అప్రమత్తం చేయగా, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

జమ్మూకశ్మీర్, తమిళనాడు రాష్ట్రాలలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి, సాధారణ జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఎకో పార్క్ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బారాముల్లా-యూరి ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. భారీ యంత్రాల సాయంతో మట్టి, బండరాళ్లను తొలగిస్తున్నారు. వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్‌ ధరపై డిస్కౌంట్‌

మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో

ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే

ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే

రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు