Weekend Hour With Murali Krishna: ది డెవిల్ ఈజ్ బ్యాక్..! అంతటా భయం.. భయం..

|

Dec 25, 2022 | 7:08 PM

చైనా సహా భారత్ చుట్టుపక్కల దేశాల్లో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైరస్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే పనిలో పడింది. ఒక వేళ కేసులు ఉధృతమైతే ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది.

చైనా సహా భారత్ చుట్టుపక్కల దేశాల్లో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైరస్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే పనిలో పడింది. ఒక వేళ కేసులు ఉధృతమైతే ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ మాక్ డ్రిల్‌లో అందుబాటులో ఉన్న బెడ్స్, మానవ వనరులు, ఆక్సిజన్ సప్లై చైన్.. ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు సహా అందుబాటులో ఉన్న ఇతర వనరులపై దృష్టి పెట్టాలని సూచించింది. కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేక తీవ్రమైన ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. నర్సులు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలను కూడా ఈ మాక్ డ్రిల్‌లో భాగం చెయ్యాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఇక విదేశాల నుంచి వచ్చే వారికి ఇప్పటికే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పని సరి చేసింది. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కోవిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Follow us on