ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మిరాకిల్ జరుగుతుంది : మల్లు రవి
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపును ఖచ్చితంగా చెబుతున్నారు. ఎన్డీఏ నుండి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, తమ అభ్యర్థికి మద్దతు పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం NDA కు మెజారిటీ ఉన్నప్పటికీ, కొంతమంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ నుండి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, దీంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధిస్తారని ఆయన అంచనా వేశారు. లోక్‌సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది ఎంపీలు ఉన్నారు. 13 మంది ఎంపీలు బహిష్కరించడంతో మొత్తం 768 ఓట్లు ఉన్నాయి. మ్యాజిక్ నంబర్ 385. ప్రస్తుతం NDA కి 439 ఓట్లు ఉన్నాయి. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 324 ఓట్ల మద్దతు ఉంది. మల్లు రవి ప్రకటనతో ఎన్నికల పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

