10వ తరగతి అర్హతతో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!
ఉద్యోగార్థులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పంజాబ్‌లోని కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 734 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 5, 2026 చివరి తేదీ.
ఉద్యోగార్థులకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. పంజాబ్‌లోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్‌లో భారీగా యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 734 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ వంటి ప్రధాన ట్రేడుల్లో ఈ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనికి తోడు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ విద్యార్హత కలిగి ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల వయోపరిమితి సెప్టెంబరు 5, 2026 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఈ నియామక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూలు నిర్వహించకపోవడం విశేషం. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారుచేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉండగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 5, 2026లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
Google Drive: గూగుల్ డ్రైవ్ వాడేవారికి అలర్ట్.. ఫొటోల బ్యాకప్ విషయంలో కీలక మార్పులు
Monsoon Update: పసిఫిక్‌లో ఎల్‌నినో సెగ.. భారత్‌లో నిలకడగా రుతుపవనాలు.. కరువు భయం లేనట్లే!
