ఉప్పల్‌ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్‌ మ్యాచ్‌.. విద్యార్ధులకు ఫ్రీ ఎంట్రీ

|

Jan 13, 2024 | 9:20 PM

ఉప్పల్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఏర్పాట్లను అపెక్స్ కౌన్సిల్ స‌భ్యుల‌తో క‌లిసి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు అర్శన‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు గురువారం ప‌రిశీలించారు. స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచ్ సంబంధిత ప‌నుల‌న్నింటిని స్వయంగా ప‌ర్యవేక్షించారు. పిచ్‌, మైదానం అవుట్ ఫీల్డ్ ప‌నులను త‌నిఖీ చేశారు. మ్యాచ్‌ను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు హెచ్‌సీఏ కార్యవ‌ర్గ స‌భ్యులంద‌రూ పూర్తి స‌మ‌యం స్టేడియంలోనే త‌మ స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నార‌ని చెప్పారు.

ఉప్పల్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఏర్పాట్లను అపెక్స్ కౌన్సిల్ స‌భ్యుల‌తో క‌లిసి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు అర్శన‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు గురువారం ప‌రిశీలించారు. స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచ్ సంబంధిత ప‌నుల‌న్నింటిని స్వయంగా ప‌ర్యవేక్షించారు. పిచ్‌, మైదానం అవుట్ ఫీల్డ్ ప‌నులను త‌నిఖీ చేశారు. మ్యాచ్‌ను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు హెచ్‌సీఏ కార్యవ‌ర్గ స‌భ్యులంద‌రూ పూర్తి స‌మ‌యం స్టేడియంలోనే త‌మ స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నార‌ని చెప్పారు. ప్రేక్షకుల సౌక‌ర్యార్థం డే టైమ్‌లో ఎండ త‌గ‌ల‌కుండా రూఫ్ టాప్ ప‌నులు, కొత్త సీట్ల ఏర్పాటును స‌కాలంలో పూర్తి చేశామ‌న్నారు. ఆట‌గాళ్ల డ్రెసింగ్ రూమ్స్‌, ఇత‌ర ఆధునీక‌ర‌ణ‌, మ‌ర‌మ్మతు ప‌నులు, శానిటేష‌న్ వ‌ర్క్స్‌ కూడా వేగంగా సాగుతున్నాయ‌ని చెప్పారు. ఇక ఈ టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠ‌శాల‌లు, గ‌వ‌ర్నమెంట్ గుర్తింపు గ‌ల స్కూల్స్‌ విద్యార్థుల‌ను ఉచితంగా అనుమ‌తించేందుకు ఒక గైడ్‌లైన్స్ రూపొందించామ‌ని జ‌గ‌న్‌మోహ‌న్ రావు చెప్పారు. విద్యార్థులను నేరుగా అనుమతించ‌మ‌ని, స్కూల్ ప్రిన్సిపాల్స్ చేసిన ధ‌ర‌ఖాస్తుల ఆధారంగానే కాంప్లిమెంట‌రీ పాసులు ఆయా పాఠ‌శాల‌ల‌కు అందిస్తామ‌ని స్పష్టం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూగోళానికి పొంచివున్న విపత్తు.. అత్యంత వేడి సంవత్సరంగా 2023

వెజ్‌ మీల్‌లో నాన్‌వెజ్‌.. ఎయిర్‌ ఇండియా విమానంలో సిబ్బంది నిర్వాకం

స్మార్ట్‌ఫోన్‌ను తలదన్నే డివైస్‌.. పాకెట్‌లో ఇమిడిపోయే ‘ర్యాబిట్‌ ఆర్‌1’

‘అటల్‌ సేతు’ పై సముద్రంలో 16 కి.మీ. ప్రయాణం

విమానంలో నిలిచిపోయిన‌ ఆక్సిజ‌న్.. ఫుట్‌బాల్‌ జట్టుకు తప్పిన ప్రమాదం