వీగన్‌ డైట్‌ చేస్తున్నారా.. ఇది మీకోసమే..!

Updated on: Apr 20, 2025 | 7:37 PM

ఇటీవల బరువు తగ్గేందుకు చాలామంది వీగన్‌ డైట్‌ని అనుసరిస్తున్నారు. దీంతో ప్రయోజనం ఉంటుందా? దీనివల్ల కలిగే లాభాలేంటో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. గుడ్లు, పాలు, మాంసం, డెయిరీ ఉత్పత్తులను తీసుకోకుండా పండ్లు, డ్రైఫ్రూట్స్‌, గింజలు, తృణధాన్యాలు వంటివి తీసుకోవడమే వీగన్‌ డైట్‌.

ఈ డైట్‌తో దీర్ఘకాలిక వ్యాధులనుంచి కోలుకోవడంతోపాటు క్యాన్సర్‌, గుండెసంబంధిత వ్యాధులు దరిచేరవు. బరువు తగ్గాలనుకునేవారికి వీగన్‌ డైట్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ తక్కువగా ఉంటాయి. మాంసం, డెయిరీ ఉత్పత్తుల్లో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికం. వీటివల్ల శరీరానికి అందే శక్తికూడా తక్కువే. ఇవే బరువు పెరిగేందుకు కారణమవుతాయి. పండ్లు, కూరగాయలతో కూడిన వీగన్‌ డైట్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. తక్కువ కేలరీలతో తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. వీగన్‌ డైట్‌ బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. దీంతో ఒబెసిటీ సమస్య రాదు. టైప్‌-2 మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. వీగన్‌ డైట్‌లో ఉన్నా ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌తో పాటు, చక్కెరను ఆహారంలో తీసుకుంటే శక్తి హీనంగా మారడంతోపాటు బరువు పెరిగే ప్రమాదం ఉంది. మాంసం వినియోగం తగ్గితే గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలు అదుపులోకి వస్తాయి. తద్వారా పర్యావరణానికి కలిగే హాని కూడా తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్త అన్నాక గొడవపడనా ?? అంత మాత్రానికే విడాకులా ?? ప్లేటు ఫిరాయించిన అమర్ భార్య!

ఇది మామూలు పూల చొక్కా కాదు.. రేట్‌ తెలిస్తే.. గుండె జారుతుంది

Naga Chaitanya: చైతూకు ఇంకో తమ్ముడు ఉన్నాడా ??

బోర్డు తిప్పేసి.. సరికొత్తగా జనాల్లోకి పచ్చళ్ల సిస్టర్స్

దేవుళ్లతో కామెడీలొద్దు.. ఇచ్చిపడేస్తారు…