గర్జించనున్న భారత యుద్ధ విమానాలు

Updated on: Feb 28, 2026 | 5:05 PM

భారత వాయుసేన 'వాయుశక్తి-2026' మెగా విన్యాసాలు ఫోఖ్రాన్‌లో ప్రారంభం కానున్నాయి. రాఫెల్, తేజస్ వంటి అధునాతన విమానాలు, స్పైడర్ క్షిపణులు తమ శక్తిని ప్రదర్శిస్తాయి. రాష్ట్రపతి, రక్షణ మంత్రి హాజరయ్యే ఈ కార్యక్రమంలో భారత వాయుసేన పోరాట సంసిద్ధత, స్వదేశీ రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడమే ప్రధాన ఉద్దేశ్యం.

భారత వాయుసేన తన అమ్ములపొదిలోని యుద్ధ తంత్రాన్ని, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్ధమైంది. రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ‘వాయుశక్తి-2026’ మెగా విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 270 కి.మీ దూరంలో జరిగే ఈ ప్రదర్శనతో ఎడారి గగనతలం యుద్ధ విమానాల గర్జనతో ప్రతిధ్వనించనుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రితో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ ప్రదర్శనలో స్వదేశీ తేజస్‌తో పాటు రాఫెల్, సుఖోయ్-30 MKI, జాగ్వార్, మిరాజ్-2000 వంటి శక్తివంతమైన విమానాలు తమ శక్తిని ప్రదర్శించనున్నాయి. అంతేకాదు.. అపాచీ, చినూక్, ఎల్‌సీహెచ్ (LCH) హెలికాప్టర్లతో పాటు సి-17, సి-130జె వంటి భారీ రవాణా విమానాలు ఈ విన్యాసాల్లో భాగం కానున్నాయి. స్పైడర్ క్షిపణి వ్యవస్థలు, అధునాతన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలు (C-UAS) తమ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నాయి . ‘ఆపరేషన్ సిందూర్’ వంటి యుద్ధ క్షేత్ర వ్యూహాలను ప్రతిబింబిస్తూ, భారత వాయుసేన పోరాట సంసిద్ధతను మరియు స్వదేశీ పరిజ్ఞానాన్ని చాటిచెప్పడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశ్యం. ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంలో భారత వాయుసేన నైపుణ్యం ఈ ప్రదర్శనతో మరోసారి వెల్లడి కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు

అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..

Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే

Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం

Follow Us