A.V. Ranganath: హైడ్రా రంగనాథ్ ఇల్లు బఫర్‌ జోన్‌లో ఉందా? ఆయనిచ్చిన క్లారిటీ ఇదే

Updated on: Mar 21, 2026 | 9:12 PM

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తన ఇంటిపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తన ఇల్లు 50 ఏళ్ల క్రితం కట్టిందని, అది బఫర్ జోన్‌లో లేదని స్పష్టం చేశారు. హైడ్రా రాజకీయాలకు అతీతంగా, చట్టబద్ధంగా పనిచేస్తుందని, పేదలకు భరోసా ఇస్తూ పెద్ద కబ్జాదారులను లక్ష్యంగా చేసుకుంటుందని వివరించారు.

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఇటీవల తన నివాసంపై తలెత్తిన వివాదంపై ” టీవీ9 క్రాస్ ఫైర్” కార్యక్రమంలో స్పందించారు. తన ఇల్లు 50 ఏళ్ల క్రితం కట్టిందని, అది కృష్ణకాంత్ పార్క్ లేదా మధురానగర్‌లోని ఏ బఫర్ జోన్ లేదా ఎఫ్‌టీఎల్ పరిధిలోనూ లేదని స్పష్టం చేశారు. తన తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని, నిబంధనలకు కట్టుబడి ఉంటారని తెలిపారు. ఇంటికి సరైన అనుమతులు, సెట్ బ్యాక్‌లు ఉన్నాయని, అనుమానం ఉంటే ఎవరైనా కొలతలు తీసుకోవచ్చని సవాల్ విసిరారు. రంగనాథ్ హైడ్రా పనితీరుపై మాట్లాడుతూ, ఇది సమాజంపై బాగా ప్రభావాన్ని చూపే ఒక ముఖ్యమైన బాధ్యత అని పేర్కొన్నారు. కబ్జాదారులు ఎవరైనా సరే వదిలిపెట్టబోమని, చట్టపరిధిలోనే చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టు తీర్పులు, జీహెచ్‌ఎంసీ చట్టంలోని నిబంధనల ప్రకారం నోటీసులు లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉందని, హైడ్రా నాటకాలకు పాల్పడదని స్పష్టం చేశారు. పేద ప్రజలకు హైడ్రా ఎప్పుడూ అండగా ఉంటుందని, అక్రమ కబ్జాల విషయంలో వారిని ఇబ్బంది పెట్టదని హామీ ఇచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us