Perni Nani : ‘రప్పా రప్పా అనే పదం జగన్‌ దృష్టికి అలా వచ్చింది’

Updated on: Sep 28, 2025 | 9:41 PM

వైసీపీ నేత పేర్ని నాని.. రప్పారప్పా అనే పదం తమ అధినేత జగన్‌ దృష్టికి ఎలా వచ్చిందో వివరించారు. ఈ పదం పుష్ప సినిమా డైలాగ్ అని, ఒక విలేకరి ద్వారా జగన్‌కు తెలిసిందని ఆయన తెలిపారు. ఆ విలేఖరి అడినప్పుడు ఏం ప్రాబ్లం లేదని.. కానీ మాజీ ముఖ్యమంత్రి దాన్ని సంభోదించిడంతో హైలెట్ అయిందన్నారు.

టీవీ9 నిర్వహించిన క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి పేర్ని నాని రప్పా రప్పా అనే పదం.. తమ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ఎలా వచ్చిందో వివరించారు. రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టడం జగన్‌ మొదలుపెట్టారని వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఒక ప్రెస్ మీట్‌లో విలేకరి అడిగిన ప్రశ్నకు సంబంధించి ఈ విషయం జగన్ దృష్టికి వచ్చిందన్నారు. ఒక నిరసనకారుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని డైలాగ్‌తో కూడిన ప్లకార్డును ప్రదర్శించాడని, దానిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆ విలేకరి జగన్ చెప్పాడని ఆయన వివరించారు. ఆ డైలాగ్ సినిమాకు చెందినదే కాబట్టి సెన్సార్ ఆమోదం పొందిన తర్వాత దాన్ని ప్రదర్శించడంలో తప్పులేదని జగన్ అన్నారని నాని వివరించారు. సామాన్య విలేకరి మాట్లాడితే ఎవరూ పట్టించుకోరని, కానీ మాజీ ముఖ్యమంత్రి ఆ పదం ఉచ్చరించడంతో ప్రాధాన్యత పెరిగిందని పేర్ని నాని చెప్పారు.

Published on: Sep 28, 2025 09:28 PM