తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! మరో 2 రోజులు దంచికొట్టనున్న వానలు!

Updated on: Jun 29, 2026 | 9:58 PM

ద్రోణుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలవవద్దని సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఏర్పడిన ద్రోణుల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లటి వాతావరణం నెలకొంది. రాబోయే గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ద్రోణుల ప్రభావంతో ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లటి వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. అలాగే అంతర్గత కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖధికారులు హెచ్చరించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడవచ్చు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల జల్లులు పడతాయని తెలిపారు. విజయవాడ నగరంలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కారుమబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు ఈ మార్పు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభం కావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ అకస్మాత్తు వర్షం వల్ల వాహనదారులు, బాటసారులు కొంత ఇబ్బంది పడినా, వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, పలు ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేయడంతో పాటు, అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. జూన్ 29న ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే జూన్ 30న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. జూలై 1న మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. జూలై 2న ఉత్తర, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు, అలాగే జూలై 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాలు రాబోయే 2–3 రోజుల్లో దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్ నగరంలో వచ్చే 24 నుంచి 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఖమ్మం నగరంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులుజలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లడంతో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఖమ్మం పాత బస్టాండ్ ప్రాంతంలో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పాదచారులు సైతం నీటిలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. వైరా,కొనిజర్ల, తల్లాడ,మండలాల్లో ఈదురు గాలులు తో కూడిన మోస్తరుగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలలో విద్యుత్. అంతరాయం కలగడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు వర్షం రాకతో రైతులు సాగు చేసిన పత్తి పంటలకు కొంత ఉపశమనం కలిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నవీ ముంబైలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో పాటు చల్లని గాలులు వీయడంతో ఎండ వేడి, ఉక్కపోత నుండి స్థానిక ప్రజలకు తీవ్ర ఉపశమనం లభించింది. అయితే ఈ కుండపోత వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి, రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, బాటసారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో మహారాష్ట్రలోని బివాండీలో కేవలం గంటపాటు కురిసిన వర్షానికే నగరం మొత్తం అతలాకుతలమైంది. భారీ వర్షం వల్ల ముందస్తు ఏర్పాట్లపై మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం బట్టబయలైంది. ఆదివారం కురిసిన భారీ వర్షంతో నగరంలోని ప్రధాన మార్కెట్లు, రహదారులు నదులను తలపించేలా నీటమునిగాయి. పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో వ్యాపారులు తమ సరుకులను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మూడు బత్తీ, భాజీ మార్కెట్, నిజాంపురా, ఆమ్‌పాడా, ఖండూపాడా, వంజార్‌పట్టీ తదితర ప్రాంతాల్లో మోకాళ్లకు పైగా నీరు చేరింది. రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో అనేక ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు మధ్యలోనే ఆగిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఐరోపా ప్రస్తుతం రికార్డు స్థాయిలో వేడిగాలుల బారిన పడుతోంది. ప్రస్తుతం అక్కడ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు దేశాల్లో ఎండలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటి.. ఏకంగా 43 నుండి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రోడ్లపై ఎండ వేడికి గుడ్లు ఫ్రై అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తీవ్రమైన పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం జూన్ 21 నుంచి గడిచిన 9 రోజుల్లోనే ఐరోపాలో ఎండల దెబ్బకు 13 వేల మందికి పైగా మరణాలు నమోదైనట్లు ఆ సంస్థ తెలిపింది.ప్రస్తుతం అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తుందని WHO హెచ్చరించింది. ప్రపంచ సగటు పెరుగుదల కంటే రెండు రెట్లు వేగంగా ఐరోపా ఖండం వేడెక్కుతోంది. ప్రస్తుతం 15 కోట్ల మంది ప్రజలు అక్కడ తీవ్రమైన ఎండల నడుమ బతుకుతున్నారు. గ్రిడ్‌లు ఫెయిల్ అవుతున్నాయి, పాఠశాలలు మూతపడ్డాయి. గతంలో తరానికి ఒకసారి వచ్చే హీట్‌వేవ్స్.. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ప్రతి ఏటా వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టడానికి యూరప్ దేశాలు అత్యవసరంగా హీట్ హెల్త్ యాక్షన్ ప్లాన్స్ అమలు చేయాలని WHO పిలుపునిచ్చింది. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని కాపాడుకుంటూ, నగరాల వేడిని తగ్గించేలా ప్రణాళికలు వేయకపోతే ఈ సైలెంట్ కిల్లర్ మరిన్ని ప్రాణాలను బలిగొంటుందని హెచ్చరించింది. యూరప్ భూమధ్యరేఖకు చాలా దూరంగా, ఉత్తరంగా ఉంది. భారత్‌లో సూర్యుడు నెత్తిమీద నుండి నిట్టనిలువుగా కిరణాలను ప్రసరింపజేస్తాడు. కానీ యూరప్‌లో సూర్యకిరణాలు ఒక కోణంలో పడతాయి. దీనివల్ల అక్కడ పగటి సమయం చాలా ఎక్కువగా ఉండి, రోజంతా ఇళ్లు, రోడ్లు తీవ్రమైన సోలార్ లోడ్‌ను నిరంతరాయంగా పీల్చుకుంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!

కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ నేనే ధనవంతురాలిని అయ్యా.. న్యూట్రిషనిస్ట్ కథ వైరల్

1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!

తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. పండ్ల బాక్స్‌లో ఉన్నది చూసి గుండె గుభేల్‌!

ఇదేం దొంగతనం సామీ.. బంగారంతో పాటు ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..!

 

Follow Us