Telangana Rains: నిర్మల్ జిల్లా భైంసాలో వడగళ్ల వాన బీభత్సం.. (Watch Video)

Telangana Rains: నిర్మల్ జిల్లా భైంసాలో వడగళ్ల వాన బీభత్సం.. (Watch Video)

Janardhan Veluru

|

Updated on: Apr 26, 2023 | 10:59 AM

నిర్మల్ జిల్లా భైంసాలో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. సోమ, మంగళవారాల్లో వర్షం కొనసాగింది. ఈదురు గాలులు, వడగళ్ల వానకు చాలాచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి.

నిర్మల్ జిల్లా భైంసాలో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో వర్షం కొనసాగింది. ఈదురు గాలులు, వడగళ్ల వానకు చాలాచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, నువ్వుల పంటలు ధ్వంసమయ్యాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటితో తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. పలు చోట్ల రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భైంసాలో వడగళ్ల వర్షం బీభత్సానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Published on: Apr 26, 2023 10:57 AM