అస్వస్థతతో గుంటూరు GGHకు వస్తున్న బాధితులు
గుంటూరు జిజిహెచ్ లో అస్వస్థతతో బాధపడుతున్న 32 మందికి చికిత్స అందిస్తున్నారు. వాంతులు, విరోచనాలు లక్షణాలున్నప్పటికీ, డయేరియా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. కృష్ణానది నుంచి దురద నీరు వస్తున్నందున, కాచి చల్లారిన నీటిని మాత్రమే తాగమని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ సూచించారు. ఇంటింటి సర్వేకు ఆదేశాలు జారీ అయ్యాయి.
గుంటూరు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) లో అస్వస్థతతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 32 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఎక్కువ మంది వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. వైద్యులు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. అయితే, బాధితులకు డయేరియా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. GGH సూపరింటెండెంట్ రమణ యశస్వి బాధితులను పరామర్శించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కూడా బాధితులను కలిశారు. కృష్ణానది నుంచి దురద నీరు వస్తున్నందున, కాచి చల్లారిన నీటిని మాత్రమే తాగమని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ సూచించారు. గుంటూరులో 13 ప్రాంతాల నుంచి ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇంటింటి సర్వే నిర్వహించాలని వైద్యశాఖకు కార్పొరేషన్ కమిషనర్ ఆదేశించారు. వైసీపీ నేతలు కూడా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో నాలుగు రోజులుగా నిలిచిన NTR వైద్య సేవలు
OG: ట్రెండ్ సెట్ చేసిన OG.. ఇది క్రేజీ ఐడియా గురూ
కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టిన ADE అంబేద్కర్
పేద యువత బతుకును.. ఫుట్‌బాల్‌తో మార్చిన రాథోడ్
TOP 9 ET News: మిరాయ్ హీరోకు కోట్ల విలువ చేసే సర్‌ప్రైజ్ గిఫ్ట్