కాశీ విశ్వనాధ్‌ ఆలయంలో రిపబ్లిక్‌ డే శోభ

Updated on: Jan 27, 2026 | 4:51 PM

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు సైతం రిపబ్లిక్ డే శోభను సంతరించుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ్, మధ్యప్రదేశ్‌లోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయాలను జాతీయ జెండా రంగులను పోలిన పుష్పాలతో అలంకరించి ప్రత్యేకతను చాటుకున్నారు.

దేశవ్యాప్తంగా రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగురవేసి ప్రజలు తమ దేశభక్తిని చాటుకున్నారు. వివిధ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ దేశ ఔన్నత్యాన్ని చాటారు. అంతేకాదే దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు సైతం రిపబ్లిక్‌డే శోభను సంతరించుకున్నాయి. ఆలయ ప్రాంగణాలను మువ్వన్నెల జెండాను తలపించేలా అలంకరించారు. దేశవ్యాప్తంగా ప్రజలు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని కాశీ విశ్వనాధుడు సైతం త్రివర్ణధారుడై భక్తులకు దర్శనం ఇచ్చారు. జాతీయ జెండా రంగులను పోలిన పుష్పాలతో శివలింగాన్ని అలంకరించారు అర్చకులు. ఆలయ ప్రాంగణం, గర్భగుడిలో సైతం రిపబ్లిక్‌డే శోభ వెల్లివిరిసింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ప్రపంచ ప్రఖ్యాత శ్రీ మహాకాళేశ్వర్ ఆలయంలో రిపబ్లిక్‌డే సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని త్రివర్ణపతాకంతో అలంకరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశభక్తికి మాటలతో పనేముంది ?? సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం

అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి

తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం

మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన