జాగ్రత్త జర.. యువతి ఒంటిపై పుట్టుమచ్చలు పట్టేసిన ఏఐ.. షాకింగ్ వీడియో
ఈ మధ్య నానో బనానా ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఈ ఏఐ టూల్ గురించే చర్చ నడుస్తోంది. ఈ కొత్త టూల్‌తో క్షణాల్లో తమ ఫోటోలను 3డీ ఇమేజ్‌లా మార్చేసుకోవచ్చు. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ కొత్త ఫీచర్‌తో తమ ఫోటోలను కావలసిన విధంగా మార్చేసుకుని తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. మహిళలకు చీరలంటే పిచ్చి కాబట్టి ఎక్కువగా ‘శారీ ట్రెండ్’ను ఉపయోగిస్తూ.. తమ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అలా నానో బనానా టూల్‌తో శారీ ట్రెండ్ కు ప్రయత్నించిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ గూగుల్ జెమినీలోని ఫ్లాష్ 2.0 ఇమేజ్ మోడల్ సాయంతో శారీ ఇమేజ్‌ను ప్రయత్నించారు. తన ఫొటోను అప్‌లోడ్ చేసి శారీలో తాను ఎలా ఉంటానో చూసుకుందామనుకుంది. తీరా ఫలితం చూశాక ఖంగుతింది. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ట్రెండ్ చూసి తానూ శారీ ఇమేజ్ జనరేటర్‌ను ప్రయత్నించానని, అయితే, ఆ ఫొటోను నిశితంగా పరిశీలించిన తనకు భయమేసిందని తెలిపింది. అందుకు కారణం… తన ఒంటిపై ఉన్న పుట్టుమచ్చను ఆ ఫోటోలో ఎక్స్‌పోజ్ చేసింది కొత్త ఫీచర్. ఈ విషయం జెమినీకి ఎలా తెలిసిందో తనకు అర్ధం కాలేదని, తాను అప్‌లోడ్ చేసిన ఇమేజ్‌లో పుట్టుమచ్చ లేదని తెలిపారు. ఇదెలా జరిగిందో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని, సోషల్‌మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్‌లలో ఫొటోలను అప్‌లోడ్ చేసేటేప్పుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించండి’’ అంటూ ఆమె సూచించారు. సదరు యూజర్ పోస్ట్ చేసిన వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘‘జెమినీ గూగుల్‌కు చెందిందన్న విషయం మరిచిపోవద్దు. మీ ఏఐ పిక్‌ను రూపొందించడానికి మీ ఫొటోలు, వీడియోలను అది వినియోగించుకుంటుంది’’ అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ మరో యూజర్ చెప్పుకొచ్చారు. తన ఫొటోలో ఎక్కడా టాటూ లేకపోయినప్పటికీ.. ఏఐ పిక్‌లో టాటూ ఉండేలా జెమినీ రూపొందించిందని కామెంట్ చేశాడు.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో
నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో
జపాన్‌లో లక్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో
