మీది ఎడమచేతి వాటమా? ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’!
ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు పొరపాటున ఎడమ చేయి చాపితే..‘కుడి చేత్తో తీస్కో’ అంటుంటారు. పిల్లలు ఎడమ చేత్తో రాస్తే.. ‘కుడి చేత్తో రాయి’ అని గద్దిస్తుంటారు. అంతెందుకు ఇంటికి మొదటిసారి వచ్చే కోడల్ని కూడా ‘కుడి కాలు పెట్టి లోపలికి రా’ అంటారు. ఎడమంటే ఎందుకంత చిన్నచూపు! అందుకే..ఓ కవి ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెఫ్ట్ హ్యాండర్స్ అందరూ ఇదే మాట అంటున్నారు. వాళ్ల సమస్యలు, బలాబలాలు అందరికీ తెలియాలనే ప్రతి ఏటా ఆగస్టు 13న లెఫ్ట్ హ్యాండర్స్ డే నిర్వహిస్తున్నారు.
మనలో చాలామంది కుడిచేతి వాటం, కొంతమంది మాత్రమే ఎడమచేతి వాటం వాళ్లు ఉంటారు. లెఫ్ట్ హ్యాండర్స్ సంఖ్య తక్కువగా ఉండడం వల్లే ‘ఎడమ’కు ఈ వివక్ష. అంతేకాకుండా పురాతనకాలం నుంచి కొన్ని ముఖ్యమైన పనులకు ఎడమ చేతిని వాడితే వింతగా చూసేవాళ్లు. మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా సంస్కృతుల్లో ఇదే పరిస్థితి. ప్రపంచ జనాభాలో 10 నుంచి 12 శాతం మంది ఎడమచేతి వాటం వాళ్లున్నారు. సాధారణంగా రోజువారి పనులు అంటే జుట్టు దువ్వుకోవడం, బరువులు ఎత్తడం లాంటివి చేసినప్పుడు ఏ చేతిని ఎక్కువగా ఉపయోగిస్తే అదే అతని చేతివాటం. ఇది పుట్టుకతో వస్తుంది. గర్భంలో ఉన్నప్పుడే శిశువు ఏ చేతివాటం అనేది తెలిసిపోతుంది. గర్భంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం శిశువులు తమ కుడి బొటనవేలును నోట్లో పెట్టుకుంటారు. వాళ్లంతా దాదాపు కుడిచేతివాటం వాళ్లే అవుతారు. ఎడమ బొటనవేలు పెట్టుకునేవాళ్లలో మూడొంతుల మంది ఎడమచేతి వాటం వాళ్లు అవుతారు. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. తల్లిదండ్రులకు ఎడమచేతివాటం ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. జీన్స్‌లో తేడాలున్నా ఎడమచేతి వాటంతో పుడతారని సైంటిస్ట్‌లు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఐశ్వర్యారాయ్ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో
సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో
ఆ సమయంలో మహిళలకు ఎందుకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందో తెలుసా?