డిస్కౌంట్‌ ఎఫెక్ట్‌.. ఎగబడి చలాన్లు కడుతున్న జనాలు

|

Dec 31, 2023 | 7:35 PM

తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు వాహనదారులు చెల్లించారు. చలాన్ల ద్వారా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 8.44 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే 3.54 లక్షల చలాన్ల చెల్లింపులు జరిగినట్లు తెలిపారు. దీంతో ఒక్క హైదరాబాద్ పరిధిలో చలాన్లతో 2.62 కోట్ల ఆదాయం సమకూరిందని, సైబరాబాద్ పరిధిలో 1.82లక్షల చలాన్ల చెల్లింపు జరగగా 1.80 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలిపారు.

తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు వాహనదారులు చెల్లించారు. చలాన్ల ద్వారా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 8.44 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే 3.54 లక్షల చలాన్ల చెల్లింపులు జరిగినట్లు తెలిపారు. దీంతో ఒక్క హైదరాబాద్ పరిధిలో చలాన్లతో 2.62 కోట్ల ఆదాయం సమకూరిందని, సైబరాబాద్ పరిధిలో 1.82లక్షల చలాన్ల చెల్లింపు జరగగా 1.80 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ట్రాఫిక్‌ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. మరోవైపు ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీసులు వాహనాల చలానా డిస్కౌంట్ లపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన సెంటర్‌లలో చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్‌ల గురించి మైక్‌లోచెబుతూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. సెంటర్లలో వాహనదారులను ఆపి వారికి డిస్కౌంట్‌ల గురించి వివరిస్తూ వారితో చలనాలను కట్టిస్తున్నారు ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యలో అంతర్జాతీయి విమానాశ్రయం పేరు మార్పు

ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 50 మీటర్ల దూరంలో కూడా కనిపించని వాహనాలు

25 వేల మంది యాత్రికుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం

కిచెన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ నుంచి వింత శబ్దాలు.. పక్కకు తీసి చూస్తే

నాంపల్లి ఎగ్జిబిషన్‌కు సర్వం సిద్ధం.. కొలువుతీరనున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు