Birthday celebrations: పుట్టిన రోజు వేడుకల్లో విషాదం.. ఒకే కుటుంబంలోని మూడు తరాల వారు బలి..

Updated on: Nov 23, 2022 | 9:02 AM

ఆనందంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వేళ పెను ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం రూపంలో ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. గాజాలోని శరణార్థుల శిబిరంలో ఈ విషాదం చోటుచేసుకుంది.


ఆనందంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వేళ పెను ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం రూపంలో ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. గాజాలోని శరణార్థుల శిబిరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక చివరికి విషాదంగా ముగిసింది. ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు అంటుకుని 21 మంది సజీవ దహనం అయ్యారు. వారిలో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు. కాగా తీరిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో నవంబరు 17 రాత్రి మూడు అంతస్తులున్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ భవనంలోని పై అంతస్తులో అబు రయా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది.ఆయన కుటుంబంలోని ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకతోపాటు, ఈజిప్టు నుంచి ఓ వ్యక్తి రావడంతో ఆనందంతో అందరూ కలిసి వేడుక జరుపుకున్నారు. ఈ క్రమంలో సంభవించిన అగ్ని ప్రమాదం వారిని పూర్తిగా దగ్ధం చేసింది. ఇంట్లో నిల్వచేసిన పెట్రోలుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నా.. దానికి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ప్రమాదం గురించి చెప్పేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా మిగలకపోవడం విషాదం. అయితే, పెట్రోలే ప్రమాదానికి కారణమన్న వార్తలను అబూ రయా బంధువు మహ్మద్ అబూరయా కొట్టిపడేశారు. వారి ఇంట్లో ఫర్నిచర్ అధికంగా ఉందని, మంటలు పెద్ద ఎత్తున చెలరేగడానికి అది కూడా కారణమై ఉంటుందని అన్నారు. బాధిత కుటుంబంలో మూడు తరాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. గాజా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇళ్లలో పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ను నిల్వచేసుకోవడం ఇక్కడి ప్రజలకు పరిపాటిగా మారింది. ఇప్పుడదే వారి ప్రాణాలు తీస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 23, 2022 09:02 AM