గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు

Updated on: Mar 13, 2026 | 6:01 PM

రామజన్మభూమి అయోధ్యలో భక్తులకు నిరంతరం అన్నదానం చేసే 'రామ్ రసోయి' సేవలు గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన గ్యాస్ సరఫరా అంతరాయం ఆలయ వంటశాలలను ప్రభావితం చేసింది. దీంతో వేలాదిమంది భక్తులు నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.

రామజన్మభూమి అయోధ్యలో భక్తులకు నిరంతరం అన్నదానం చేసే ‘రామ్ రసోయి’ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన గ్యాస్ కొరత ప్రభావం నేరుగా ఆలయ వంటశాలలపై పడింది. గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల వంటలు సిద్ధం చేయడం సాధ్యం కాకపోవడంతో, భక్తులకు అందించే ఉచిత భోజన సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ నిర్వహణ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ప్రతిరోజూ దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు అయోధ్యను సందర్శిస్తుంటారు. రామ్ లల్లా దర్శనం తర్వాత భక్తులందరూ రామ్ రసోయిలో భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఒక్కసారిగా సేవలు రద్దు కావడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గ్యాస్ కొరత కారణంగా కేవలం పరిమిత సంఖ్యలో ఉన్న నిల్వలతో కొద్దిమందికి మాత్రమే భోజనం అందించగలిగామని,  ప్రస్తుతం అత్యవసర పరిస్థితి తలెత్తడంతో సేవలు పూర్తిగా రద్దు చేయక తప్పలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తమైంది. ఈ ప్రభావం సామాన్యుడి వంటగది నుంచి పుణ్యక్షేత్రాల వంటశాలల వరకు పాకింది. గ్యాస్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని, తద్వారా రామ్ రసోయి వంటి సేవా కార్యక్రమాలు పునఃప్రారంభం కావాలని భక్తులు కోరుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..

“అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు

Follow Us