ఏపీలో తుపాన్ బీభత్సం.. సంతకు వెళ్లి వస్తూ వాగులో కొట్టుకుపోయారు

|

Dec 08, 2023 | 7:25 PM

తుఫాన్ తీరం దాటినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరిగింది. ప్రమాదకరంగా ప్రవహించే గెడ్డలు దాటే క్రమంలో.. గిరిజనులు గల్లంతవుతున్నారు. అనంతగిరి మండలం భింపోల్ లో లవ్వ గెడ్డ ఉదృతంగా ప్రవహిస్తోంది. సీతపాడు గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజనులు సంతకు వెళ్లి వస్తూ గెడ్డ దాడుతుండగా గల్లంతయ్యారు.

తుఫాన్ తీరం దాటినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరిగింది. ప్రమాదకరంగా ప్రవహించే గెడ్డలు దాటే క్రమంలో.. గిరిజనులు గల్లంతవుతున్నారు. అనంతగిరి మండలం భింపోల్ లో లవ్వ గెడ్డ ఉదృతంగా ప్రవహిస్తోంది. సీతపాడు గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజనులు సంతకు వెళ్లి వస్తూ గెడ్డ దాడుతుండగా గల్లంతయ్యారు. గల్లంతయిన ముగ్గురు గిరిజనులు గెమ్మెల కుమార్‌, మిరియాల కమల, గెమ్మెల లక్ష్మి కోసం రెస్క్యూ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. పొద్దు పోయినప్పటికీ వాళ్ళ ఆచూకీ కనిపించలేదు. పిఓ అభిషేక్ స్వయంగా గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన ముగ్గురులో కాశీపట్నం వద్ద కుమార్ మృతదేహం లభించింది. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దింపే అవకాశం ఉందని అనంతగిరి తహసిల్దార్ రాంబాయి వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్ కోచ్‌ దిగువ భాగం నుంచి వెలువడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

పెళ్లి వేడుకలో బెల్లీ డాన్స్‌ అదరగొట్టిన తాతగారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఆటో డ్రైవర్‌ సాహసం.. తప్పిన పెను ప్రమాదం

కన్నీరు పెట్టుకున్న కిమ్‌ !! నియంతను ఏడిపించిన వారు ఎవరు ??

డమ్మీ బాంబు అని భావించిన దంపతులకు షాక్‌ !!