అందం, ఆరోగ్యం కోసం సూపర్ ఫుడ్స్.. తప్పకుండా తీసుకోండి.. సరదాగా..

Updated on: Jul 25, 2025 | 1:04 PM

బలమైన దేహం కావాలన్నా.. మెదడు పని తీరు బాగుండాలన్నా.. రోగనిరోధక శక్తి పెరగాలన్నా.. ఏం తినాలనే దానిపై ఫిట్‌నెస్ కోచ్ డాన్‌ గో తన ఇన్‌స్టా గ్రామ్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సూపర్ ఫుడ్స్ ను తన డైట్‌లో చేర్చుకున్నట్లు ఆయన ఆ వీడియోలో వెల్లడించారు. ఇంతకీ ఆ సూపర్ ఫుడ్స్ ఏంటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

సూపర్ ఫుడ్ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సినవి.. గుడ్లు. పలు పోషకాలు, విటమిన్లతో నిండిన గుడ్లను తినటం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అలాగే, రోజూ బ్లూబెర్రీస్ తినటం వల్ల రక్తపోటుకు చెక్ పెట్టొచ్చు.దీనివల్ల గుండె జబ్బుల ముప్పును గణనీయంగా తగ్గుతుంది. బ్లూబెర్రీస్‌లో ఉండే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ మరియు విటమిన్ కె జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సూపర్ ఫుడ్ జాబితాలో మూడవది.. సాల్మన్ చేప. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే.. ఈ చేపలు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సూపర్ ఫుడ్ జాబితాలో నాల్గవది.. కివీ పండు. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు తింటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ పండు కంటే ఎక్కువ విటమిన్ సి ఉండే ఈ పండు.. గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గానూ పనిచేస్తుంది. రక్తంలో తగినన్ని తెల్ల రక్తకణాలుండేందుకు కివి పండు వినియోగం దోహదపడుతుంది. క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రొకలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వండుకుని లేదా పచ్చిగా తిన్నా మంచిదే. దీనిలోని విటమిన్‌ కె, క్యాల్షియం.. ఎముకలను బలోపేతం చేయటమే గాక ఇందులోని.. అధిక ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించి బరువు పెరగకుండా సహాయ పడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జీతమంతా ఈఎంఐలకే పోతోందా? మీ పరిస్థితీ ఇదేనా?

నిద్ర లేవగానే ఇలా చేస్తే.. మీ జీవితం అల్లకల్లోలమే

ఇంటి కప్పులో శబ్దాలు.. ఏంటని చూసిన ఓనర్ షాక్‌

బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తున్నారా.? అయితే.. రిస్కే

తన స్టైల్లో వీరమల్లు సినిమాకు రివ్యూ ఇచ్చిన హైపర్ ఆది