Zika virus: కర్ణాటకలో తొలి జికా వైరస్‌ కేసు.. వాటి ద్వారానే సోకిన వైరస్‌.. తస్మాత్ జాగ్రత్త..!

|

Dec 21, 2022 | 8:16 AM

కర్ణాటకలో తొలి జికా వైరస్‌ కేసును గుర్తించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కోళి క్యాంపు గ్రామానికి


కర్ణాటకలో తొలి జికా వైరస్‌ కేసును గుర్తించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కోళి క్యాంపు గ్రామానికి చెందిన బాలిక రక్తనమూనాలను డెంగీ, గున్యా వైరస్‌ నిర్ధారణల తర్వాత జికా వైరస్‌ పరీక్షల కోసం పుణెకు పంపగా పాజిటివ్‌గా తేలిందన్నారు.ఎలాంటి ప్రయాణ నేపథ్యం లేని ఈ బాలికకు దోమల ద్వారానే వైరస్‌ సోకినట్లు మంత్రి స్పష్టం చేశారు. పాజిటివ్‌ కేసు నమోదైనా ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. ప్రభుత్వం బాలిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందించే ఏర్పాట్లు చేసిందని వివరించారు. జికా వైరస్‌ కేసు తొలుత కేరళలో నమోదు కాగా తర్వాత మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చేశాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 21, 2022 08:16 AM