Telangana: రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టంగా అలముకున్న పొగలు

Updated on: Nov 11, 2024 | 7:27 PM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరంగర్ చౌరస్తాలో ఘెర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ గోదాంతో పాటు పక్కనే ఉన్న టింబర్ డిపోకి ఒక్కసారిగా విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతోనే భారీగా మంటలు చెల్లరేగాయి.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరంగర్ చౌరస్తాలో ప్లాస్టిక్ గోదాంతో పాటు పక్కనే ఉన్న టింబర్ డిపోకి ఒక్కసారిగా విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతోనే భారీగా మంటలు చెల్లరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసింది. ఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Nov 11, 2024 07:26 PM