Natural Star Nani : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో నేచురల్ స్టార్ నాని

Updated on: Nov 10, 2022 | 3:05 PM

స్వామివారిని దర్శించుకున్న నానికి ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికారు.. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి తీర్థ ప్రసాదాలను అందించారు.

నేచురల్ స్టార్ నాని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న నానికి ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికారు.. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి తీర్థ ప్రసాదాలను అందించారు. అలాగే నాని ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. నాని ప్రస్తుతం దసరా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Published on: Nov 10, 2022 02:53 PM