Suriya: తగ్గడం తెలుసన్న సూర్య.. తెలుగు మార్కెట్‌ కోసమేనా ??

Edited By:

Updated on: Nov 27, 2025 | 6:03 PM

సంవత్సరాంతం సమీపిస్తున్న తరుణంలో, సంయుక్త, కృతి శెట్టి, కీర్తి సురేష్, కృతి సనన్ వంటి హీరోయిన్స్ తమను తాము నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో లేదా సౌత్‌లో బలమైన స్థానం కోసం వీరు బిగ్ హిట్స్ ఆశిస్తున్నారు. సినిమాలకు గ్యాప్ ఇచ్చినవారు, లేదా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నవారు, ఈ ఏడాది చివరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఎవరైనా సొంత మార్కెట్‌ మీద హోల్డ్ కోసం పొరుగు మార్కెట్‌ని పక్కనపెట్టేస్తారు. కానీ, జస్ట్ తెలుగు మార్కెట్‌ కోసం సొంత మార్కెట్‌ని పక్కనపెడుతున్న హీరోని చూశారా? ఇప్పటిదాకా వినకపోయినా.. ఇప్పుడు సూర్య గురించి వింటున్న వారు.. ‘అవునా.. నడిప్పిన్‌ నాయగన్‌’ అలా ఆలోచిస్తున్నారా?’ అని అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది? వచ్చే సంక్రాంతికి మామూలుగా లేదు పోటీ. తెలుగు నుంచి సాలిడ్‌ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. మన సినిమాలకే థియేటర్లు ఎలా దొరుకుతాయా? అని ఆలోచిస్తున్నారు జనాలు. అలాంటిది ఈ సందర్భంలో పొరుగు సినిమాలు కూడా పోటీకి వస్తే..? వస్తే అనే మాట ఎందుకు? నేను రావడం లేదంటున్నారు సూర్య. ఈ దీపావళికి రావాల్సిన కరుప్పు సినిమాను రేస్‌ నుంచి తప్పించి, పొంగల్‌కి తీసుకొద్దామనుకున్నారు. కానీ తెలుగులో థియేటర్లు దొరికే పరిస్థితి లేదు కాబట్టి, ఇప్పడు ఆ రేసు నుంచి కూడా తప్పుకుంటున్నారు. జనవరి 23న వద్దామని ఫిక్సయ్యారు కరుప్పు సూర్య. కానీ ముందే చెప్పిన తేదీకే ల్యాండ్‌ కావాలని ఫిక్సయ్యారు జననాయగన్‌. విజయ్‌ హీరోగా నటిస్తున్న ఆఖరి సినిమా అంటూ జననాయగన్‌ని ఎప్పటి నుంచో ప్రమోట్‌ చేస్తున్నారు. ఆల్రెడీ పరాశక్తి లైన్లో ఉంది. కానీ సూర్య పరిస్థితి వేరు. వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నారు ఈ హీరో. ఆ సినిమా ఓపెనింగ్స్ దండిగా రావాలంటే, కచ్చితంగా కరుప్పు నెంబర్స్ సాలిడ్‌గా ఉండాలి. అది జరగాలంటే తప్పకుండా మంచి థియేటర్లు దొరకాలి. అందుకే ఓ అడుగు ఆగుతున్నట్టున్నారు నడిప్పిన్‌ నాయగన్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్

ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

Published on: Nov 27, 2025 06:02 PM