Yash: రాఖీ భాయ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్
యష్ ‘టాక్సిక్’ సినిమాపై అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు హీరోయిన్ రుక్మిణి వసంత్ తెరదించారు. షూటింగ్ తుది దశలో ఉన్నా, అప్‌డేట్స్ లేకపోవడంతో ఆందోళన చెందిన ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చారు. వెండితెరపై ఇంతవరకు చూడని అద్భుతమైన కథతో గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని వెల్లడించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టాక్సిక్ సినిమా విషయంలో అభిమానుల్లో కొంతకాలంగా టెన్షన్ నెలకొంది. షూటింగ్ చాలా రోజులుగా జరుగుతున్నప్పటికీ, ఒక్క టీజర్ మినహా ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేకపోవడంతో సినిమా అవుట్‌పుట్ పట్ల అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది. అయితే, ఈ సందేహాలకు హీరోయిన్ రుక్మిణి వసంత్ తాజాగా తెరదించారు. రాఖీ బాయ్ యష్ అభిమానులకు భరోసా ఇచ్చే కీలక సమాచారాన్ని ఆమె వెల్లడించారు. యష్, కేజీఎఫ్ విజయాల తర్వాత కొంత విరామం తీసుకుని టాక్సిక్ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా నిర్మాణానికి కూడా గణనీయమైన సమయం తీసుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వానర యుద్ధం అంటే ఇదే.. భయంతో ప్రజలు పరుగో పరుగు
హే కోతి లెవ్! అది బండరాయి కాదే.. బట్టతల.. దిగు.. దిగు
ఈ సారి బైక్ మీద కాదు.. ఆటోలోనే రచ్చ రచ్చ చేసిన జంట..