Allu Aravind Vs Yash: అల్లు అరవింద్ Vs యశ్.. మొత్తం వాళ్ళే చేశారా..?

Edited By:

Updated on: Sep 06, 2026 | 11:09 AM

యష్‌ ‘టాక్సిక్‌’కు డిజాస్టర్‌ టాక్‌ రావడంతో సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ చర్చలు పెరిగాయి. ఇదే సమయంలో అల్లు అరవింద్‌ గతంలో యష్‌, ‘కేజీఎఫ్‌’ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఇప్పుడు కాంటెక్స్ట్‌ లేకుండా ప్రచారం చేస్తూ కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని తెలుగు, కన్నడ ఇండస్ట్రీల మధ్య గొడవగా మార్చే ప్రయత్నం జరుగుతోందనే చర్చ కూడా నెట్టింట జరుగుతోంది.

ఫెయిల్యూర్‌ను యాక్సెప్ట్ చేయడానికి చాలా గట్స్ కావాలి. కానీ ప్రజెంట్ జనరేషన్‌లో చాలా మంది ఆ గట్స్‌ లేదు. అందుకే తమ ఫెయిల్యూర్‌ను కప్పిపుచ్చేందుకు రకరకాల దారులు వెతుకుతున్నారు. యష్‌ టాక్సిక్ టీమ్ కూడా అదే చేస్తోంది. సినిమా రిజల్ట్‌పై వస్తున్న నెగెటివిటీని డైవర్ట్ చేసేందుకు కావాలనే ఓ పాత వివాదాన్ని తెరపైకి తెచ్చి అనవసరమైన రచ్చ చేస్తోంది. ఇంతకీ ఏంటా వివాదం..? డిటైల్డ్‌గా చూద్దాం పదండి. కేజియఫ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యష్‌ నుంచి వచ్చిన సినిమా కావడంతో ‘టాక్సిక్’ మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడం ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. సోషల్ మీడియాలో టాక్సిక్ ఫెయిల్యూర్‌ గురించి పెద్ద ఎత్తున నెగెటివ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు గతంలో యష్‌, కేజీఎఫ్ గురించి మాట్లాడిన ఓ పాత వీడియో నెట్టింట సడెన్‌గా వైరల్‌గా మారింది. ఈ టైమింగ్ చూస్తుంటే.. ఇదంతా కావాలనే చేస్తున్నారనే డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ఈ వీడియోలో కేజీఎఫ్ సినిమా యష్‌ కెరీర్‌ను ఎలా మార్చేసిందో చెప్పారు. ఆ సినిమా ఇంపాక్ట్ వల్లే అతను నేషనల్ వైడ్ స్టార్ అయ్యారన్నారు. స్వయంగా యష్‌ కూడా పలు వేదికలపై కేజీఎఫ్ తన కెరీర్‌ను మార్చేసిందని అంగీకరించారు. కానీ ఇప్పుడు ఆ వీడియోను కాంటెక్స్ట్ లేకుండా కట్ చేసి.. యష్‌‌ను అల్లు అరవింద్ అవమానించారంటూ కొత్త వివాదానికి తెర తీశారు. దీన్ని మెల్లగా తెలుగు వర్సెస్ కన్నడ ఇండస్ట్రీల ఫైట్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అల్లు అరవింద్‌కి కన్నడ సినిమా అంటే ఎంతో గౌరవం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంతార. అలాంటి సెన్సేషనల్ కన్నడ బ్లాక్ బస్టర్‌ను తెలుగు ఆడియన్స్‌కు దగ్గర చేసి, ప్రమోట్ చేసింది ఆయనే. అలాగే కన్నడ సినిమాలను ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకుంటూనే ఉన్నారు. రెండు ఇండస్ట్రీల మధ్య ఎలాంటి ఫైట్ లేకపోయినా.. అనవసరంగా ఫ్యాన్స్‌ను ఈ గొడవలోకి లాగుతోంది టాక్సిక్ టీమ్‌. సినిమా పోయిందన్న ఫ్రస్ట్రేషన్‌ను కవర్ చేసుకునేందుకు.. ఆడియన్స్ అటెన్షన్‌ను డైవర్ట్ చేయడానికి టాక్సిక్ టీమ్ వాడుతున్న చీప్ పీఆర్ ట్రిక్ ఇదన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఎంత గోల చేసినా, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసినా ఆడియన్స్ ఇచ్చిన తీర్పును మార్చలేరు. ఇలాంటి డైవర్షన్ గేమ్‌ పక్కనపెట్టి ఫెయిల్యూర్‌ను అంగీకరిస్తే బెటర్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైన మేకర్స్ అర్ధం చేసుకుంటారేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొంచి ఉన్న పెను ముప్పు

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?

Loading...
Unable to load recommendations.
Follow Us