Dulquer Salmaan: మలయాళ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్

Edited By:

Updated on: Jul 13, 2026 | 6:19 PM

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ విజయాల తర్వాత టాలీవుడ్‌లో ఆయనకు భారీ మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’తో పాటు ‘శ్రీ శ్రీ’ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న దుల్కర్, పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెలుగు చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు హీరో కాకపోవచ్చు కానీ మన దగ్గర చాలా మందికి లేని ట్రాక్ రికార్డ్ దుల్కర్ సల్మాన్ సొంతం. ఇక్కడ ఆయన నటించిన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి. అందుకే తన సొంత భాష కంటే తెలుగులోనే వరుస సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మన దర్శకులు కూడా దుల్కర్‌ను ఓన్ చేసుకున్నారు.ప్రస్తుతం పవన్ సాదినేనితో ఆకాశంలో ఒక తార అనే సినిమాలో దుల్కర్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్ లాంటి ప్రస్టేజియస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నారు దుల్కర్. SLV సినిమాస్ బ్యానర్‌పై రవి నేలకుదిటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు దుల్కర్. ఇందులో ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఇలా పూర్తిగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టిన దుల్కర్.. మలయాళం ఇండస్ట్రీని వదిలేసినట్లే అనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

Follow Us