వెండితెరకు ముప్పు.. ఓటీటీల పెత్తనానికి చెక్‌ పెట్టేదెవరు

Updated on: Oct 10, 2025 | 9:34 PM

సౌత్ లో ఓటీటీల పెత్తనం వెండితెరకు సవాల్ విసురుతోంది. బాలీవుడ్ తరహాలో ఎనిమిది వారాల విండో రూల్ లేకపోవడంతో సినిమాలు నాలుగు వారాల్లోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. దీని వల్ల థియేటర్ ఫుట్‌ఫాల్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టి థియేటర్లను ఎవరు కాపాడతారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

వెండితెరపై ఓటీటీల ఆధిపత్యంపై విస్తృత చర్చ జరుగుతోంది. కోవిడ్ సమయంలో సినీరంగానికి కొత్త మార్కెట్‌గా పరిచయమైన ఓటీటీలు, ఇప్పుడు థియేట్రికల్ రన్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో, హిట్‌ చిత్రాలు సైతం నాలుగు వారాల్లోనే ఓటీటీల్లోకి రావడంతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. నార్త్ లో ఎనిమిది వారాల విండో రూల్ గట్టిగా అమలవుతున్నప్పటికీ, సౌత్ లో అలాంటి నిబంధనలు లేవు. ప్రస్తుతం కేవలం మూడు ప్రధాన ఓటీటీ సంస్థలు సంవత్సరానికి గరిష్టంగా 160 సినిమాలు మాత్రమే విడుదల చేయగలవు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రంప్‌కు అమెరికా సెనేటర్ల లేఖ.. భారత్‌తో బంధం పెంచుకోవాలని సూచన

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన

శ్రీరాముడిని గుర్తు చేసిన దక్షిణాఫ్రికా క్రికెటర్.. విల్లు-బాణం ఫోజు పెట్టి సెంచరీ సెలబ్రేషన్

గంభీర్ ఇంట్లో స్పెషల్ డిన్నర్.. స్పెషల్‌ లుక్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

Mass Jathara: మాస్ జాతర పై బాహుబలి ప్రభావం ఎంత