‘కోపంతో ఊగిపోతూ కుర్చీ విసిరేశారు’ చిరులో మరో కోణం- చెప్పిన బాబీ

Updated on: Jan 18, 2023 | 9:16 AM

ఫిల్మ్ ఇండస్ట్రీలో కోపానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఎవరైన టక్కున చెప్పే పేరు బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణను మించేలా ఓ సారి చిరు సీరియస్ అయ్యారని తాజాగా చెప్పారు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ.

ఫిల్మ్ ఇండస్ట్రీలో కోపానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఎవరైన టక్కున చెప్పే పేరు బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణను మించేలా ఓ సారి చిరు సీరియస్ అయ్యారని తాజాగా చెప్పారు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ. చిరులో మరో కోణం చూశా అన్నట్టు ఓ ఎక్స్‌ ప్రెషన్ కూడా ఇచ్చారు ఈ యంగ్ డైరెక్టర్. ఎస్ ! ఎప్పుడూ కామ్‌గా.. కూల్‌గా.. నవ్వుతూ కనిపించే చిరంజీవి.. కోపం చూపించే సందర్భాలు చాలా అరుదు. కాని అలాంటి అరుదైన ఓ సందర్భంలో తను పక్కనే ఉన్నా అంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు బాబీ. బాసు ఓ సినిమా షూట్‌ గ్యాప్లో కూర్చోని ఇడ్లీ తింటూ ఉండగా.. మేనేజర్ తన పక్కనే తచ్చాడుతూ కాస్త టెన్షన్‌గా కనిపించారట. దీంతో మెగాస్టార్ పిలిచి ఏంటని ఆరా తీయగా.. షాట్ రెడీ అయి చాలా సేపైందని చెప్పారట. దీంతో ఒక్క సారిగా సీరియస్ అయిన చిరు.. పక్కనే ఉన్న కుర్చీని విసిరేసి.. మేనేజర్ పై అరిచారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డేంజర్‌ ఫిష్.. తల తెగినా పవర్‌ తగ్గలేదుగా.. వీడియో చూస్తే ఒళ్ళు జలదరించడం ఖాయం

బైకర్ దెబ్బకు లారీ ఫసక్.. రెప్పపాటులో తప్పించుకున్నాడు.. ఒళ్లు గగుర్పొడిచే సీన్‌..

పైసా ఖర్చు లేకుండా ట్రెడ్ మిల్.. అవార్డు నీకే.. ఆనంద్‌ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో

Waltair Veerayya: వీరయ్య విధ్వంసం అంటే ఇది !! 3 రోజుల్లోనే 108 కోట్లు !!

Veera Simha Reddy: బాలయ్య బాక్సాఫీస్ ఊచకోతకు.. 100 కోట్లకు పైగా లెక్క..

 

Published on: Jan 18, 2023 09:15 AM
Loading...
Unable to load recommendations.
Follow Us