Chiranjeevi: మెగా సెంటిమెంట్‌తో కొడుతున్న చిరంజీవి.. మరో హిట్ పక్కాన ?
విశ్వంభర విడుదల ఆలస్యమైనా, జూలై 9న కొత్త తేదీ విషయంలో మెగా అభిమానులు సంతోషంగా ఉన్నారు. చిరంజీవి హింట్‌తో జూలై నెల మెగా హీరోలకు బ్లక్‌బస్టర్ అనుబంధంగా మారింది. చిరంజీవి ఇంద్ర, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, రామ్ చరణ్ మగధీర వంటి సినిమాలు జూలైలో విడుదలై ఘన విజయం సాధించాయి.
విశ్వంభర లేటైతే అయింది గానీ కొత్త డేట్ విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నారు మెగా అభిమానులు. దానికి కారణం కూడా లేకపోలేదు. మొన్న చిరంజీవి ఇచ్చిన హింట్‌తో మెగా ఫ్యాన్స్‌కు బ్లాక్‌బస్టర్ అనుబంధాలున్నాయి. దాంతో పాటు మరో సెంటిమెంట్ ఊరిస్తుంది వాళ్లను. మరి ఏంటా రిలేషన్..? ఇంతకీ విశ్వంభర ఎప్పుడు రాబోతుంది..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా.. ఆఫ్టర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్లు మన శంకరవరప్రసాద్ గారుతో బాక్సాఫీస్ షేక్ చేసారు మెగాస్టార్. దాంతో ఈ సినిమా దెబ్బకి విశ్వంభర ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా ఎప్పుడు రాబోతుందనే టాక్ మొదలైందిప్పుడు ఇండస్ట్రీలో. దీనికి సమాధానం జూలై 9 అని తెలుస్తుంది. అదేరోజు విశ్వంభరను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మెగా ఫ్యాన్స్‌కు జూలై సెంటిమెంట్ ఎక్కువే.. ఆ నెలలో వచ్చిన చాలా సినిమాలు మెగా హీరోలకు బాగా కలిసొచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి కెరీర్ కాస్త డౌన్‌లో ఉన్నపుడు 2002 జులై 24న వచ్చిన ఇంద్ర రికార్డ్స్ తిరగరాసింది. ఇంద్ర ఒక్కటే కాదు.. పవన్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ తొలిప్రేమ విడుదలైంది కూడా జులై 24నే. 1998 జులై 24న తొలిప్రేమ విడుదలైంది. ఈ ఒక్క తేదీ మాత్రమే కాదు.. జులై నెల అంతా మెగా హీరోలకు బాగా కలిసొచ్చింది. 1999 జులై 15న విడుదలైన తమ్ముడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పవన్ మార్కెట్ మరింత పెంచేసిన సినిమా ఇది. అంతేకాదు.. రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమా విడుదలైంది 2009 జులై 31న. వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఫిదా కూడా 2017, జులై 21నే విడుదలైంది. శంకర్‌దాదా జిందాబాద్, బ్రో, హరిహర వీరమల్లు లాంటి ఫ్లాపులొచ్చినా.. 90 శాతం జులైలో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్సే. అందుకే విశ్వంభరపై నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. పైగా మన శంకరవరప్రసాద్ గారి జోరు కూడా దీనికి హెల్ప్ కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్ హీరోయిన్స్ కాదు.. కేరాఫ్ టాలీవుడ్ వాళ్లు
హిట్టు కోసం అష్టకష్టాలు.. అయినా కరుణించని విజయం
Kerala Story 2: మరో కాంట్రవర్సీకి రంగం సిద్ధం.. రచ్చ చేస్తున్న కేరళ స్టోరీ 2 టీజర్
దసరాపై దండయాత్ర.. రేసులో ముగ్గురు స్టార్స్
TOP 5 ET: మరో వార్.. మరి ఈ సారి ఏమువుతుందో..? | నైజాంలో చిరు నయా రికార్డ్