Vishal: పెళ్లికి ముందే సంచలన నిర్ణయం తీసుకున్న హీరో విశాల్‌

Updated on: Sep 02, 2025 | 12:34 PM

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన 48వ పుట్టినరోజు ఆగస్టు 29ను మరింత మధురంగా మార్చుకున్నాడు. తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధన్సికతో ఎంగేజ్ మెంట్ చేసుకుని తన బర్త్ డేను మెమరబుల్ గా మార్చుకున్నాడు. చైన్నైలో విశాల్- సాయి ధన్సికల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు.

కాబోయే దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. అయితే అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే విశాల్- సాయి ధన్సికల పెళ్లి జరిగి ఉండేది. కానీ కొన్ని కారణాలతో ఈ శుభకార్యం వాయిదా పడింది. అయితే మరో రెండు నెలల్లో తన పెళ్లి జరుగుతుందని విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నడియార్ సంఘం భవనం నిర్మాణం జరుగుతోందని, మరో రెండు నెలలలో ఈ భవన నిర్మాణం పూర్తి కావడంతో అందులోనే తన వివాహాన్ని చేసుకోబోతున్నట్లు తెలిపాడు. మొత్తానికి ఎట్టకేలకు విశాల్ పెళ్లిపీటలు ఎక్కనుండడంతో అతని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సాయి ధన్సికతో పెళ్లి నేపథ్యంలో సినిమాల పరంగా హీరో విశాల్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అదేంటంటే.. పెళ్లి తర్వాత ఈ హీరో కిస్సింగ్ సీన్లలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడట. రొమాంటిక్ సీన్లకు పెద్దగా అభ్యంతరం లేదు కానీ.. హీరోయిన్లతో లిప్ కిస్ సన్నివేశాలకు దూరంగా ఉంటానన్నాడట ఈ యాక్షన్ హీరో. ఈ నేపథ్యంలో ‘దేవుడు నాకోసం దేవకన్య లాంటి ధన్సికను పంపించారు’ అంటూ తన కాబోయే భార్య గురించి విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి హీరో విశాల్ మంచి నిర్ణయం తీసుకున్నాడని అతని అభిమానులు స్పందిస్తున్నారు. కాగా అక్టోబర్ లో విశాల్- సాయి ధన్సికల వివాహం జరగనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Krish Jagarlamudi: ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన క్రిష్‌