Vijay: కన్‌ఫ్యూజన్‌కు తెర దించిన దళపతి

Edited By: Phani CH

Updated on: Nov 08, 2025 | 1:24 PM

నో మేర్ డౌట్స్... విజయ్ చివరి రిలీజ్ ఆన్ టైమ్‌ అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్‌. షూటింగ్‌కు బ్రేక్ పడటంతో అనుకున్న టైమ్‌కు జన నాయగన్‌ ఆడియన్స్‌ ముందుకు వస్తుందా లేదా అన్న డౌట్స్ రెయిజ్‌ అయ్యాయి. కానీ ఈ అనుమానాలకు లేటెస్ట్ అప్‌డేట్‌తో చెక్‌ పెట్టారు మేకర్స్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ నటిస్తున్న ఆఖరి సినిమా జన నాయగన్‌.

అందుకే ఈ సినిమా మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా విజయ్‌ పొలిటికల్‌ కెరీర్‌కు కూడా ప్లస్ అయ్యేలా మెసేజ్‌ ఓరియంటెడ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్‌కు ఇటీవల బ్రేక్ పడింది. విజయ్‌ పాల్గొన్న పొలిటికల్ సభలో తొక్కిసలాట జరగటంతో అన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకున్నారు దళపతి. దీంతో జన నాయగన్ రిలీజ్ వాయిదా పడుతుందేమో అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి. కొద్ది రోజులుగా మూవీ టీమ్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవటంతో సినిమా వాయిదా పడటం కన్ఫార్మ్‌ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్‌. కానీ ఫైనల్‌గా మేకర్స్ నుంచి అఫీషియల్ క్లారిటీ వచ్చింది. నో మోర్ డిలేస్‌, ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆన్‌ టైమ్ ఆడియన్స్‌ ముందుకు రావటం పక్కా అన్ని క్లారిటీ ఇచ్చింది యూనిట్‌. కొత్త పోస్టర్‌తో రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీ ఇవ్వటంతో పాటు షూటింగ్ రీస్టార్ట్ అయిన విషయాన్ని కూడా కన్ఫార్మ్ చేసింది. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా వెలిగిన కరెంటు బుగ్గ

Rhino: కొమ్ములో విషం.. స్మగ్లర్లకు శాపం..

ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు

నేను ఐఏఎస్‌ను.. ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా వచ్చాను

ఆమె అప్పుడు హైదరాబాదీ.. ఇప్పుడు అమెరికాలో వర్జీనియా గవర్నర్