కొడుకు తప్పుకు.. సారీ చెప్పిన స్టార్ హీరో

Updated on: Jul 10, 2025 | 8:55 PM

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతికి తెలుగునాట కూడా మాంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈయన.. తన కొడుకు తరపున క్షమాపణ చెప్పడం ఇప్పుడు కోలీవుడ్ లో సెన్సేషన్ అవుతోంది. కొడుకు కారణంగా తమ అభిమాన హీరో ఫస్ట్ టైం సారీ చెప్పాల్సి వచ్చిందంటూ.. సేతుపతి ఫ్యాన్స్‌ ఫీలవుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

తమ అభిమాన హీరో కొడుకు సూర్య తీరును విమర్శిస్తున్నారు. విజయ్ సేతుపతి తనయుడు సూర్య హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన నటించిన తొలి చిత్రం ఫీనిక్స్ జూలై 4న ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అందులో తండ్రిలాగే అద్భుతమైన నటనతో సూర్య అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో వేసిన ఆ సినిమా ప్రీమియర్ షో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ ప్రీమియర్ షో వేళ..సూర్యకు సంబంధించి మీడియా వారు రిలీజ్ చేసిన కొన్ని వీడియోస్ ను డిలీట్ చేయాలని.. సూర్య పీఆర్ టీమ్.. మీడియాపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై విజయ్ సేతుపతి స్పందించారు. “సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు నిజంగా అలాంటి ఒత్తిడి తెచ్చి ఉంటే.. అది మాకు తెలియకుండా జరిగి ఉండవచ్చు. కనుక, ఈ విషయంలో ఎవరైనా బాధపడితే వారికి నా తరపున సారీ చెబుతున్నాను” అని విజయ్ సేతుపతి అన్నారు. సూర్య హీరోగా నటించిన ఫీనిక్స్ సినిమాలో దేవదర్శిని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించగా.. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనుషులకే దిక్కులేదంటే.. కుక్కకేమో గ్రాండ్‌గా బర్త్‌ డే పార్టీ…!

నాలుగో పెళ్లాం వచ్చిన వేళా విశేషం.. లాటరీ గెలిచిన నటుడు…

మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా.. !

‘అతను చనిపోవడమే బెటర్..’ ఉదయ్‌ చావుపై కౌషల్‌ షాకింగ్ కామెంట్స్

ఆలియాకు టోకరా వేసిన PA.. పోలీసులకు పట్టించిన హీరోయిన్