Vijay-Rashmika Marriage: కట్టా- మీటా లాంటి లవ్‌ స్టోరీ.. ఎన్ని స్టేజ్‌లు దాటారంటే ??

Updated on: Feb 27, 2026 | 8:37 PM

2018లో మొదలై 2019లో ప్రేమగా మారిన విజయ్ దేవరకొండ - రష్మికల బంధం ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. నెట్టింట వైరల్ అవుతున్న విరోష్ పెళ్లి వేడుక, వారి ఉమ్మడి ఆస్తులు, వ్యక్తిగత అలవాట్లు, కెరీర్ శ్రద్ధ, హనీమూన్ ప్లాన్స్, కోడవా సంప్రదాయం వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి. 2018లో మొదలైన పరిచయం.. 2019లో ప్రేమగా మారిన తరుణం.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకరికోసం మరొకరు నిలుచుని ఒడుదొడుకులను ఎదుర్కొన్న వైనం..

01.2018లో మొదలైన పరిచయం.. 2019లో ప్రేమగా మారిన తరుణం..

2018లో మొదలైన పరిచయం.. 2019లో ప్రేమగా మారిన తరుణం.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకరికోసం మరొకరు నిలుచుని ఒడుదొడుకులను ఎదుర్కొన్న వైనం.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన శుభదినం అంటూ విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వేడుకకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నెట్టింట్లో.

02.విజయ్‌లోని ఆ ఒక్క అలవాటు రష్మికకు నచ్చదట

అందరికీ తెలుగు రష్మిక ఎప్పుడూ సరదాగా ఉంటారు. నవ్వుతూ అందర్నీ పలకరిస్తారు. తనకు సంబంధించిన హ్యాపీ మూమెంట్స్‌ను అందరితో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ విజయ్‌ దేవరకొండ మాత్రం అలా కాదన్నది రష్మిక మాట. విజయ్‌ ఎప్పుడూ సీరియస్‌గా ఉంటాడని.. అలా ఉండడమే తనకు ఇష్టమని.. గతంలో రష్మిక ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతేకాదు విజయ్ ఎప్పుడూ ఫోన్‌లోనే గడుపుతుంటారని అదే విజయ్‌లో తనకు నచ్చని అలవాటని ఓ సందర్భంల్లో రష్‌ కోట్ చేసింది. అయితే ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్‌ నెట్టింట వైరల్ అవుతున్న వేళ.. రష్మిక మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

03.ఈ విషయాల్లో.. ఈ ఇద్దరూ ఒక్కలాగే…

ఇద్దరి మనుసులు కలిసాయంటే..! మూడు ముళ్ల బంధంతో ఒక్కయ్యే వరకు వారిద్దరూ వచ్చారంటే..! వారి ఇష్టా ఇష్టాలు కూడా చాలా వరకు కలిసినట్టే గా..! ఇక రష్మిక – విజయ్‌ దేవరకొండ కూడా చాలా విషయాల్లో ఒక్కలాగే ఉంటారు.వారి ఆలోచనా ధోరణి కూడా దాదాపు ఒకేలా ఉంటుందని వారిద్దరి నియర్ అండ్ డియర్స్ చెబుతున్నారు. విజయ్‌ దేవరకొండది, రష్మిక ఇద్దరిదీ మిడిల్ క్లాస్ నేపథ్యం. దీంతో వీరిద్దరి ఆలోచనలు దాదాపు ఓకేలా ఉంటాయని.. జీవితం పట్ల వీరిద్దరి దృక్పథం దాదాపు సమానం.అంతేకాదు వీరిద్దరూ తమ తమ మూలాలను మర్చిపోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక వీరిద్దరిలో కామన్‌గా కనిపించే మరో లక్షణం.. కెరీర్ పట్ల అత్యంత శ్రద్ధ. ఇద్దరూ తమ తమ పనిని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. విజయ్‌ అయితే ఎప్పుడూ పనిలోనే ఉంటాడని… విజయ్‌ వర్క్‌ రాకేట్‌ అని ఓ సందర్భంలో కోట్ చేసింది. అలాగే రష్మిక కూడా చాలా కష్టపడే స్వభావం కలదని విజయ్ కూడా చాలా ఇంటర్వ్యూల్లో ప్రశంసించాడు. విరోష్‌, రష్మిక ఇద్దరూ భోజన ప్రియులు. విజయ్‌కు బిర్యానీ అంటే అమితమైన ఇష్టం ఉండగా, రష్మికకు జపనీస్‌ వంటకాలంటే చాలా ఇష్టం. ఇద్దరూ డాగ్‌ లవర్స్‌, ఫిట్‌నెస్‌ ఫ్రీక్స్‌. వీటితో పాటే.. ఇద్దరూ తమ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాలను చాలా సీక్రెట్‌గా ఉంచేందుకు ఇష్టం పడతారు. ఇలా చాలా విషయాల్లో ఈ ఇద్దరి ఇష్టా ఇష్టాలు ఒకేలా ఉంటాయి కనుకే.. వీరిద్దరూ ప్రేమించుకుని.. పెళ్లి తో ఒక్కటయ్యారు.

04.విజయ్‌కు ఇష్టం లేని కారణంగానే.. ఇన్నాళ్లూ రష్మిక సైలెంట్‌గా ఉందట!

గీతా గోవిందం సినిమాతో పరిచయం.. ఆ తర్వాత డియర్ కాంమ్రెడ్ సినిమాతో ప్రేమ.. దాదాపు 9 ఏళ్లుగా సీక్రెట్ రిలేష్‌. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటిగా ప్రయాణం షురూ. మరి ఇన్నాళ్లూ ఎందుకింత సీక్రెట్ అంటే.. తమ పర్సనల్ మ్యాటర్‌ను పబ్లిక్‌ చేయడం విజయ్‌కు ఇష్టం లేదు కనుకే.. రష్మిక సైలెంట్‌గా ఉందనే ఆన్సర్ వస్తోందిప్పుడు.. రష్ నియర్ అండ్ డియర్స్ నుంచి. ఎస్! మూమెంట్స్‌ క్రియేట్‌ చేయాలే కానీ.. ఫిల్టర్‌ లేకుండా అన్నీ బయటపెట్టకూడదనే విజయ్‌ పర్సనల్ ఓపీనియన్‌కు కట్టుబడే.. కాస్త కలివిడిగా ఉండే రష్మిక కూడా… విజయ్‌తో ప్రేమ వ్యవహారాన్ని ఇన్నాళ్లూ సీక్రెట్‌గా ఉంచారట. అయితే అప్పుడప్పుడూ ఆమె బార్డర్ క్రాస్‌ అయి హింట్‌ ఇచ్చేలా కొన్ని ఫోటోలను షేర్‌ చేసినప్పటికీ.. రష్‌ చేసిన ఈ నాటీ పనిని విజయ్‌ ఎంజాయ్‌ చేశారే కానీ.. సీరియస్ అవ్వలేదట.

05.హోలీ – హల్దీ.. కలగలిపిన పెళ్లి

మూడు రోజుల పెళ్లి.. 80ల్లో జరిగే పెళ్లిని తలపించే పెళ్లి…సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే, ఆధునికతను మేళవించిన పెళ్లి, హోలీ – హల్దీని కలగలిపిన పెళ్లి, ఆత్మీయుల ఆనందాలకు ఏమాత్రం లోటులేకుండా విందులూ, వినోదాలను ఏర్పాటు చేసిన పెళ్లి అంటూ అక్కడి విషయాలను విన్నవారు, బ్లర్డ్ ఫొటోల్లో చూసిన వారూ తోచినంత చెప్పుకుంటూనే ఉన్నారు. తమ అభిమాన హీరో హీరోయిన్‌ పెళ్లిని సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

06. అరటి బోదెలను నరుక్కుంటూ.. వీరుడిలా వివాహ వేదికకు విజయ్‌..

మూడు రోజులుగా ఆనందంగా సాగుతున్న వివాహ వేడుక ఫిబ్రవరి 26 సాయంత్రం కొడవ సంప్రదాయంలో జరిగే వివాహ తంతుతో పూర్తయింది. అరటి బోదెలను నరుక్కుంటూ వరుడు వివాహ వేదికకు రావడం, అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న వధువును మనువాడటం కొడవ సంప్రదాయంలో ప్రత్యేకత.తెలుగు సంప్రదాయం ప్రకారం వైవాహిక తంతును పూర్తి చేసుకున్న నూతన వధూవరులు మరోసారి కొడవ సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకోవడం. ఆ తంతును చూడడం.. విరోషి పెళ్లికి వెళ్లిన అతిథులకు ఓ మరిచిపోని అనుభూతిని పంచే ఉంటుంది.

07.హనీమూన్ ప్లాన్స్

విరోష్‌ వెడ్డింగ్‌ ఫోటోలు బయటికి వచ్చాయి. అవి నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి. ఈక్రమంలోనే విజయ్‌ అండ్ రష్మిక నెక్స్ట్‌ ప్లాన్‌ గురించి వీరిద్దరి నియర్ అండ్ డియర్స్‌ ఓ అప్డేట్ ఇచ్చారు. హనీమూన్ కోసం ఈ స్టార్ కపుల్.. ఓ వారం పాటు తమ వర్క్‌కు హాలీడే ప్రకటించనున్నారట. మార్చ్‌4 హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్ తర్వాత.. ఒక వారం పాటు అన్ని పనులను పక్కన పెట్టి విజయ్‌ అండ్ రష్మిక హనీ మూన్‌ వెళ్లనున్నారట. అందుకోసం ఆఫ్రికాలోని కెన్యా లేదా మాల్దీవులను ఎంచుకోనున్నారుట ఈ స్టార్ కపుల్.

08. నరదిష్టి తగలొద్దు దేవుడా…

‘నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుందని.. మన పెద్దలు సామెత చెబుతుంటారు. ఒక వ్యక్తి చూపు లేదా ఆలోచన ఎదుటివారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని.. దీన్నే నరదిష్టి లేదా దృష్టి దోషం అంటారని వివరిస్తూ ఉంటారు. దీని వల్ల అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు లేదా పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయని కూడా అందరూ విశ్వసిస్తారు. తాజాగా విరోష్‌ వెడ్డింగ్ ఫోటోలు బయటికి వచ్చిన నేపథ్యంలో.. తమ హీరోకు ఎక్కడ నరదిష్టి తగులుతందోనని రౌడీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పెళ్లి కొడుకుగా ముద్దుగా ఉన్న తమ హీరోకు విజయ్‌ కు ఎలాంటి దిష్టి తగలొద్దని నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఈవిల్ ఐ ఎమోజీని విజయ్‌ రష్‌ ఫోటోల కింద కామెంట్‌ సెక్షన్లో పెడుతున్నాయి. ఇక మరో పక్క రష్‌ ఫ్యాన్స్‌ కూడా ఇదే చేస్తున్నారు. తమ హీరోయిన్‌ పై ఎవరి దిష్టి తగలొద్దని కోరుకుంటున్నారు.,

09. రష్మికకి కాదు.. విజయ్‌కే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి!

రెండు మూడు రోజులుగా వెడ్డింగ్ ఆఫ్ విరోష్‌ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలోనే వీరిద్దరిలో ఎవరి సంపాదన ఎంత..? ఎవరి ఆస్తులు ఎక్కువ అనే.. అందరూ ఆరా తీస్తున్నారు. అయితే నికర ఆస్తుల విలువలో విజయ్‌ దేవరకొండ ఆస్తి విలువే కాస్త ఎక్కవగా లేటెస్ట్ రిపోర్ట్స్ బట్టి తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ ఆస్తుల విలువ సుమార్ 66 కోట్ల నుంచి 70 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. అదే రష్మిక ఆస్తి విలువ 66 కోట్ల వరకు ఉంటుందని అంచనా.. అదే ఈ ఇద్దరి ఉమ్మడి ఆస్తి విలువను లెక్కేస్తే 130 కోట్ల నుంచి 136 కోట్ల మధ్య ఉంటుందని అంచనా..!

10. ఆస్తి విలువ విజయ్‌దే ఎక్కువ అయినా.. సంపాదనలో రష్మికే తోప్‌

విజయ్‌ నికర ఆస్తి విలువ రష్మిక కంటే కాస్త ఎక్కువే అయినా కూడా… రష్మిక బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌ ద్వారా వచ్చే సంపాదన విషయంలో ఓ అడుగు ముందే ఉన్నట్టు రిపోర్ట్. రష్మిక నేషనల్‌ క్రష్‌ కావడం.. ఆమెకు పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్‌ కంటే కాస్త ఎక్కువ క్రేజ్‌ ఉండడంతో.. రష్మిక కోసం బ్రాండ్స్‌ అన్నీ క్యూ కడుతున్న పరిస్థితి. అంతేకాదు ఈమెకు బ్రాండ్ క్వీన్ అనే ట్యాగ్ ఉంది. ఇక రష్‌ సుమారు 20కి పైగా బ్రాండ్‌లకు ఎండార్స్‌ చేస్తోంది.ఇందుకోసం ఒక్కో యాడ్‌కు సుమారు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. అయితే విజయ్‌ విషయానికి వస్తే.. మన రౌడీ కేవలం 10 బ్రాండ్స్‌కే ప్రజెంట్ ఎండార్స్‌ చేస్తున్నాడు. ఒక్కో యాడ్‌ కు 3 నుంచి 7 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika Marriage: 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పడిన వేళ.. విరోషి పెళ్లి ఆనందభరితం

Bigg Boss Emmanuel: బిగ్ బాస్‌ ఓటమిని తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ

టైమ్ తీసుకుంటున్న టాప్‌ స్టార్స్‌… ఈ గ్యాప్ మంచిదేనా

Zombie Reddy 2: త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న జాంబీ రెడ్డి సీక్వెల్

బడ్జెట్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సంజయ్ లీలా భన్సాలి

Follow Us