Vijay-Rashmika Marriage: ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే.. అందుకే కలిశారేమో..

Updated on: Feb 27, 2026 | 8:39 PM

రష్మిక, విజయ్ దేవరకొండల ప్రేమ, వివాహ బంధం వారి ఉమ్మడి అభిరుచులు, మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చింది. కెరీర్ పట్ల అంకితభావం, ఆహారం, పెంపుడు జంతువులపై ప్రేమ వంటి అనేక విషయాలు వారిని దగ్గర చేశాయి. ఇద్దరి ఆలోచనా విధానం, జీవితం పట్ల దృక్పథం ఒకేలా ఉండటంతో వారి బంధం మరింత బలపడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

ఇద్దరి మనసులు కలిసాయంటే..! మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే వరకు వారిద్దరూ వచ్చారంటే..! వారి ఇష్టా ఇష్టాలు కూడా చాలా వరకు కలిసినట్టేగా..! ఇక రష్మిక – విజయ్‌ దేవరకొండ కూడా చాలా విషయాల్లో ఒక్కలాగే ఉంటారు. వారి ఆలోచనా ధోరణి కూడా దాదాపు ఒకేలా ఉంటుందని వారిద్దరి నియర్ అండ్ డియర్స్ చెబుతున్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక ఇద్దరిదీ మిడిల్ క్లాస్ నేపథ్యం. దీంతో వీరిద్దరి ఆలోచనలు దాదాపు ఓకేలా ఉంటాయని.. జీవితం పట్ల వీరిద్దరి దృక్పథం దాదాపు సమానంగా ఉంటుందని చెబుతారు. అంతేకాదు వీరిద్దరూ తమ తమ మూలాలను మర్చిపోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక వీరిద్దరిలో కామన్‌గా కనిపించే మరో లక్షణం.. కెరీర్ పట్ల అత్యంత శ్రద్ధ. ఇద్దరూ తమ పనిని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. విజయ్‌ అయితే ఎప్పుడూ పనిలోనే ఉంటాడని… విజయ్‌ వర్క్‌ రాకెట్‌ అని ఓ సందర్భంలో కోట్ చేసింది. అలాగే రష్మిక కూడా చాలా కష్టపడే స్వభావం కలదని విజయ్ కూడా చాలా ఇంటర్వ్యూల్లో ప్రశంసించాడు. విరోష్‌, రష్మిక ఇద్దరూ భోజన ప్రియులు. విజయ్‌కు బిర్యానీ అంటే అమితమైన ఇష్టం.. రష్మికకు జపనీస్‌ వంటకాలంటే చాలా ఇష్టం. ఇద్దరూ డాగ్‌ లవర్స్‌, ఫిట్‌నెస్‌ ఫ్రీక్స్‌. వీటితో పాటే.. ఇద్దరూ తమ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాలను చాలా సీక్రెట్‌గా ఉంచేందుకు ఇష్టపడతారు. ఇలా చాలా విషయాల్లో ఈ ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉంటాయి కనుకే.. వీరిద్దరూ ప్రేమించుకుని.. పెళ్లితో ఒక్కటయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika Marriage: కట్టా- మీటా లాంటి లవ్‌ స్టోరీ.. ఎన్ని స్టేజ్‌లు దాటారంటే ??

Vijay-Rashmika Marriage: 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పడిన వేళ.. విరోషి పెళ్లి ఆనందభరితం

Bigg Boss Emmanuel: బిగ్ బాస్‌ ఓటమిని తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ

టైమ్ తీసుకుంటున్న టాప్‌ స్టార్స్‌… ఈ గ్యాప్ మంచిదేనా

Zombie Reddy 2: త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న జాంబీ రెడ్డి సీక్వెల్

Follow Us