బండారు వ్యాఖ్యలపై రగడ.. రోజాకు మద్దతుగా కదంతొక్కుతున్న సినీతారలు

|

Oct 09, 2023 | 2:58 PM

ఏపీ మంత్రి ఆర్కే రోజాకు పలువురు సినీతారలు బాసటగా నిలిచారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేయడం తెలిసిందే. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్‌పై ఆయన్ను విడుదల చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారుపై న్యాయ పోరాటం చేయబోతున్నట్లు ఇప్పటికే మంత్రి రోజా ప్రకటించారు.

ఏపీ మంత్రి ఆర్కే రోజాకు పలువురు సినీతారలు బాసటగా నిలిచారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేయడం తెలిసిందే. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్‌పై ఆయన్ను విడుదల చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారుపై న్యాయ పోరాటం చేయబోతున్నట్లు ఇప్పటికే మంత్రి రోజా ప్రకటించారు. ఈ వ్యవహారంలో తాను సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నట్లు తెలిపారు. బండారుపై సివిల్, క్రిమిషనల్ పరువు నష్టం దావాలు వేయబోతున్నట్లు స్పష్టంచేశారు. కాగా తమ సహచర నటి, ఏపీ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలను పలువురు సినీ తారలు తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో రోజాకు మద్దతు తెలియజేస్తూ నటీమణులు కుష్బూ సుందర్, రమ్య కృష్ణ, రాధికా శరత్ కుమార్, మీనా, కవిత, మహారాష్ట్రకు చెందిన ఎంపీ, నటి నవనీత్ కౌర్ తదితరులు వీడియోలను విడుదల చేశారు.

ఓ మహిళా మంత్రిపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అమానుషమని వారు మండిపడ్డారు. వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండారు సత్యనారాయణను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.