Venkatesh: మళ్ళీ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ సెంటిమెంట్.. ఏకే 47తో రెడీ అవుతున్న వెంకీ మామా

Updated on: Dec 12, 2025 | 4:06 PM

వెంకటేష్ తన తదుపరి చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ డ్రామాకు ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం తర్వాత కొంత విరామం తీసుకున్న ప్రముఖ నటుడు వెంకటేష్, తన తదుపరి చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. బుధవారం ఈ సినిమా చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించింది. వెంకీ తాజా చిత్రానికి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌తోనే చిత్ర బృందం సినిమా ఫ్లేవర్‌పై ఒక హింట్ ఇచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రాలకు ఆ అక్షరంతో ప్రారంభమయ్యే టైటిళ్లను పెట్టే సెంటిమెంట్‌ను ఈ సినిమాతో మరోసారి కొనసాగిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Deepika Padukone: దీపిక మీద ఫైర్‌ అవుతున్న సౌత్ ఆడియన్స్‌.. ఎందుకు అంత కోపం ??

ఇప్పటి నుండే మొదలైన సమ్మర్ సినిమాల సమరం.. పోటీ మాములుగా లేదుగా

Sandeep Reddy Vanga: ఆ సినిమాతో సందీప్‌ రూలింగ్‌కు చెక్‌ పడినట్టేనా ??

Shah Rukh Khan: షారుక్ ఖాన్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్‌.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

Pragathi: నన్ను చాలామంది ట్రోల్ చేశారు.. నేను నా గెలుపు తో సమాధానం చెప్పా