Over Reaction on Telugu Movies: తెలుగు సినిమాలపై వీడి ఓవర్ యాక్షన్ ఎక్కవైంది.. వీడియో వైరల్.

|

Feb 13, 2023 | 9:54 AM

పాన్ ఇండియా పుణ్యమో.. లేక ఎల్లలు దాటుతున్న మన స్టార్ హీరోస్‌ క్రేజ్‌ పుణ్యమో తెలియదు కానీ.. తెలుగు సినిమాపై రివ్యూ ఇచ్చే నార్త్ వారు పెరుగుతున్నారు. మన సినిమాలు చూడకుండానే.. మన స్టార్ల గురించి తెలియకుండానే..

పాన్ ఇండియా పుణ్యమో.. లేక ఎల్లలు దాటుతున్న మన స్టార్ హీరోస్‌ క్రేజ్‌ పుణ్యమో తెలియదు కానీ.. తెలుగు సినిమాపై రివ్యూ ఇచ్చే నార్త్ వారు పెరుగుతున్నారు. మన సినిమాలు చూడకుండానే.. మన స్టార్ల గురించి తెలియకుండానే.. నెట్టింట తెగ రివ్యూలిస్తున్నారు. సినిమాలు రిలీజ్ కాకముందే మన స్టార్ హీరోల సినిమాపై కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. నేమ్ అండ్ ఫేమ్ సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఉమైర్ సంధు అనే వ్యక్తి కాస్త ఎక్కువ చేస్తున్నారు. మన హీరోల ఫ్యాన్స్‌కు బుక్కవుతున్నారు.ఎస్ ! ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా.. రివ్యూవర్‌గా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనను తాను కోట్ చేసుకునే ఉమైర్ సంధు.. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలపైనే.. అందులోనూ టాలీవుడ్ టాప్ స్టార్ సినిమాల పైనే పడ్డారు. ఓ సినిమా… రిలీజ్ కు రెడీ అవ్వడమే ఆలస్యం.. ‘జెస్ట్ నవ్ సినిమా చూశాను.. ఇట్స్ డిజాస్టర్ ఫిల్మ్ .. ఇట్స్ సూపర్ హిట్ ఫిల్మ్’ అంటూ సోషల్ మీడియాలో షార్ట్ రివ్యూలివ్వడం.. ఫ్రాడ్ రివ్యూలివ్వడానికి కాస్త ఎక్కువగా చేశారు.రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన మెగాస్టార్ చిరూస్ వాల్తేరు వీరయ్య విషయంలోనే ఇదే చేశారు. సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందే సినిమా చూశానంటూ.. సినిమా రొటీన్గా వరెస్ట్ గా ఉందంటూ ట్వీట్ చేశారు. బాలయ్య వీరసింహా రెడ్డి విషయంలోనూ ఇలాగే ట్వీట్ చేశారు. ఇలా తన ట్వీట్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాననే ఉమైర్ అనుకుంటున్నారు కానీ.. మన టాలీవుడ్ ఫిల్మ్ లవర్స్‌ ను హర్ట్ చేస్తున్నారని మాత్రం తెలుసుకోలేకపోయారు. ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశాడు. రియాక్షన్‌గా ట్రోల్ అవుతున్నారు. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవడిరా.. అనే మాస్ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 13, 2023 09:54 AM