Trivikram Srinivas: ట్రిపుల్‌ ఆర్‌ హీరోలతో గురూజీ.. ప్లానింగ్‌ పెద్దదే

Updated on: Jan 20, 2026 | 4:45 PM

గురూజీ త్రివిక్రమ్ తన తదుపరి సినిమాల లైనప్‌తో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్‌తో 'ఆదర్శకుటుంబం' తర్వాత, ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాను తీయబోతున్నారు. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తోనూ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ తర్వాత, త్రివిక్రమ్ RRR హీరోలు ఎన్టీఆర్, చరణ్‌లను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం పొందబోతున్నారు. ఫ్యాన్స్‌కు పండుగే!

హీరోల లైనప్పే ఎప్పుడూ భారీగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత వాళ్లతో, ఆ సినిమా తర్వాత వీళ్లతో అంటూ రకరకాల కాంబినేషన్లు వినిపిస్తుంటాయి. అయితే అందుకు భిన్నంగా కొన్నిసార్లు డైరక్టర్ల లైనప్‌ కూడా స్ట్రాంగ్‌గా మారుతుంటుంది. ఇప్పుడు మన గురూజీ త్రివిక్రమ్‌ లైనప్‌ ఉన్నట్టు…. ఇంతకీ గురుజీ గుడ్‌ లుక్స్ లో ఉన్న హీరోలెవరు? చూసేద్దాం వచ్చేయండి. గుంటూరు కారం రిలీజ్‌ అయ్యాక.. నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి కాసింత ఎక్కువ గ్యాపే తీసుకున్నారు గురూజీ. ఇప్పుడు వెంకటేష్‌తో ఆదర్శకుటుంబం హౌస్‌ నెంబర్‌ 47ని తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్‌. ఈ మూవీ తర్వాత ఆయనేం చేయబోతున్నారంటే.. వితౌట్‌ ఎనీ డౌట్.. అందరూ తారక్‌ సినిమా అని స్ట్రాంగ్‌గా చెప్పేస్తారు. ఇప్పుడు నీల్‌ సెట్స్ లో ఉన్న తారక్‌, త్వరలోనే గురుజీ సెట్స్ కి వెళ్తారు. త్రివిక్రమ్‌తో తారక్‌ సినిమా అనగానే అందరికీ అరవింద సమేత వీరరాఘవ గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షన్‌ని చూపించిన గురుజీ… నెక్స్ట్ మాత్రం మైథలాజికల్‌ టచ్‌ ఉన్న సబ్జెక్టుని తారక్‌తో డీల్‌ చేస్తున్నారన్నది స్ట్రాంగ్‌ న్యూస్‌. తారక్ సినిమా పూర్తవగానే రామ్‌చరణ్‌ తో సినిమాను ప్లాన్‌ చేస్తున్నారట త్రివిక్రమ్‌. గురుజీ రాసిన లైన్లను కెమెరా ముందు చెప్పాలని, థియేటర్లో చప్పట్లు కొట్టించుకోవాలని ప్రతి హీరోకీ ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న పెద్ది, ఆ తర్వాత సుకుమార్‌ సినిమా పూర్తవగానే, త్రివిక్రమ్‌ డైలాగులను చరణ్‌ చెప్పబోతున్నారన్నమాట. ట్రిపుల్‌ ఆర్‌ హీరోలను బ్యాక్ టు బ్యాక్‌ హ్యాండిల్‌ చేసిన క్రెడిట్‌ ఇప్పటిదాకా కొరటాల శివ ఖాతాలో ఉంది. నెక్స్ట్ త్రివిక్రమ్‌ ఖాతాలోకి రాబోతోందని హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు

Sreeleela: శ్రీలీల భారీ ప్లానింగ్‌.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా

కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా

Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా

వంద కోట్ల క్లబ్ లో.. సత్తా చాటుతున్న సీనియర్ హీరోలు