పెళ్లి పీటలెక్కుతున్న త్రిష.. పెద్దలు చూసిన సంబంధానికి గ్రీన్‌ సిగ్నల్‌

Updated on: Oct 10, 2025 | 3:53 PM

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల త్రిష పెళ్లి ముచ్చట మరోసారి వార్తలకెక్కింది. తాజాగా కోలీవుడ్ సర్కిల్స్‌లో త్రిష పెళ్లికి సంబంధించిన వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. గతంలో త్రిషకు బిజినెస్ మ్యాన్‌ వరుణ్‌ మనియన్‌తో జరిగిన నిశ్చితార్థమైనా, అది అనుకోకుండా రద్దయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పిన త్రిష.. కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. తాజాగా, ఆమె తల్లిదండ్రులు ఓ సంబంధం చూసారని, దానికి త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టుగా టాక్ న‌డుస్తుంది. తాజా సమాచారం ప్రకారం,చండీఘర్‌కు చెందిన ఓ యువకుడితో త్రిష పెళ్లి సంబంధం ఖాయమైనట్లు తెలుస్తోంది. అతడు ఆస్ట్రేలియాలో స్థిరపడి బిజినెస్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల తన వ్యాపారాన్ని భారత్‌లో విస్తరించాడని కూడా చెబుతున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఓకే అనటంతో త్రిష కూడా ఈ సంబంధానికి ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌లో చర్చ న‌డుస్తుంది. అయితే దీనిపై .. త్రిష నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం త్రిష చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ లో నటిస్తోంది. అదే సమయంలో తమిళంలో ‘కరుప్పు’ అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇవే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు. త్రిషకు గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేకపోవడంతో ఈ రెండు సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది. ఇక బాలీవుడ్‌లో కూడా త్రిష రీఎంట్రీకు ప్లాన్ చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క సినిమాతో బాలీవుడ్ ప్రయాణాన్ని ఆపేసిన త్రిష, ఇప్పుడు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోందట. మ‌రి తాజాగా త్రిష పెళ్లికి సంబంధించి జ‌రుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉందనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే.. ఏదిఏమైనా తమ అభిమాన నటి పెళ్లి ఈసారి ఖాయమని అంటున్నారు ఆమె అభిమానులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విడాకులతో పార్టీ చేసుకున్న వ్యక్తి పాలతో స్నానం, కేక్ కటింగ్

భారీగా ట్రాఫిక్ జామ్.. నాలుగు రోజులుగా రోడ్ల మీదే వాహనదారులు

ఫస్ట్ టైం లాటరీ టికెట్ కొని.. పాతిక కోట్లు గెలిచిన పెయింటర్

రైలు ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. రైలు టికెట్లు రద్దు చేయాల్సిన పనిలేదు