Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక్.. హిట్టా..? ఫట్టా..?
టాలీవుడ్‌లో ప్రతివారం కొత్త సినిమాలు వస్తున్నా..వాటిల్లో కొన్ని మాత్రమే రిలీజ్‌కి ముందు అటెన్షన్‌ని గ్రాప్ చేస్తాయి. అలా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు.
వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఇక బార్బరిక్ కథలోకి వెళితే.. డాక్టర్ శ్యామ్ అలియాస్ సత్యరాజ్ పేరు మోసిన సైకియాట్రిస్ట్. ఆయన ప్రాణం మొత్తం మనవరాలు నిధి అలియాస్ మేఘన మీదే ఉంటుంది. కొడుకు కోడలు చనిపోవడంతో మనవరాలిని ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటాడు. అలాంటిది ఒక రోజు స్కూలుకు వెళ్లి మాయమైపోతుంది శ్యామ్ మనవరాలు. దాంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. అక్కడ ఇన్స్పెక్టర్ అలియాస్ వీటివి గణేష్ కానిస్టేబుల్ చంద్ర అలియాస్ సత్యం రాజేష్ను ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తాడు. మరోవైపు రామ్ అలియాస్ వశిష్ట విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. దానికోసం డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన స్నేహితుడు దేవ్ అలియాస్ క్రాంతి కిరణ్ జల్సాలకు అలవాటు పడి 30 లక్షల పైగా అప్పులు చేస్తాడు. ఆయన అత్త వాకిలి పద్మ అలియాస్ ఉదయభాను ఒక ఏరియా మొత్తాన్ని డాన్ లా పాలిస్తూ ఉంటుంది. మరోవైపు తప్పిపోయిన మరవరాలి కోసం వెతుకుతూ ఉంటాడు శ్యామ్. వీళ్ళందరి కథలోకి సత్య అలియాస్ సాంచి రాయ్ ఎలా వచ్చింది.. అసలు ఆ అమ్మాయి దొరికిందా లేదా అనేది అసలు కథ.. త్రిబాణదారి బార్బరిక్.. ట్రైలర్ చూసినప్పుడు అందరూ సోషియో ఫాంటసీ అనుకున్నారు. మహాభారతంలోని క్యారెక్టర్ తీసుకురావడంతో కచ్చితంగా ఇందులో కూడా ఏదో ఒక ఫాంటసీ అంశాలు ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలు మాత్రం అలాంటివి కనిపించకపోవడం కాస్త డిసప్పాయింట్ చేసే విషయం. దర్శకుడు ఆ బార్బరికుడు క్యారెక్టర్ ఇప్పటి కథకు లింకు చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అంతేగాని ఇందులో ఫాంటసీ అంశాలు ఉండవు. స్టోరీ చాలా వరకు ఈజీగానే అర్థమయిపోతుంది. ముఖ్యంగా శోభన్ బాబు హీరోగా నటించిన సర్పయాగం సినిమా ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. ఒక సైకియాట్రిస్ట్.. ఆయన మనవరాలు మిస్ అవుతుంది.. మరోవైపు ఇద్దరు కుర్రాళ్ళు ఈ కేసులో ప్రధాన అనుమానితులుగా ఉంటారు.. వీళ్ళందరి చుట్టూ కథ సాగుతూ ఉంటుంది. ఫస్టాఫ్ చాలా వరకు వేగంగానే వెళ్ళిపోయింది. అక్కడక్కడ చిన్నచిన్న ట్విస్టులు ఇస్తూ.. స్క్రీన్ ప్లే ముందుకు వెనక్కి జరిపాడు దర్శకుడు. సత్యరాజ్ మనవరాలు మిస్ అయిన తర్వాత స్టోరీ కాస్త వేగంగా వెళుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: