Toxic: ఇండియన్ సినిమానా.. హాలీవుడ్ యాక్షన్ మూవీనా?
యశ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. 4.38 నిమిషాల నిడివితో ఉన్నప్పటికీ కథను పూర్తిగా రివీల్ చేయకుండా ఆసక్తిని కొనసాగించారు. యశ్ ద్విపాత్రాభినయంలో కనిపించగా, నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ పాత్రలను పరిచయం చేశారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కిన విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది.. ఆల్రెడీ వచ్చిన టీజర్స్, పాటలతోనే సినిమా ఎలా ఉండబోతుందో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ట్రైలర్‌తో బొమ్మ మొత్తం కళ్ల ముందు కనిపిస్తూ.. ఎలాంటి సంచలనంతో యశ్ రాబోతున్నారో పిన్ టూ పిన్ అర్థమైపోయింది. అసలు టాక్సిక్ ట్రైలర్ ఎలా ఉంది..? సినిమాలో ఏం చూపించబోతున్నారు..? మనం చూసేది చూస్తున్నది నిజంగా ఇండియన్ సినిమానేనా.. లేదంటే ఏదైనా ఇంటర్నేషనల్ యాక్షన్ సినిమా చూస్తున్నామా..? టాక్సిక్ ట్రైలర్ చూస్తున్నపుడు కచ్చితంగా ఈ డౌట్ అందరికీ వస్తుంది. కేజియఫ్ తర్వాత ఓ లేడీ డైరెక్టర్‌ను నమ్మి యశ్ సినిమా చేస్తున్నారబ్బా అనే ప్రశ్నకు అసలైన సమాధానం ఇప్పుడొచ్చిన టాక్సిక్ ట్రైలరే.. ఆ మేకింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒకటి రెండు నిమిషాలు కాదు.. ఏకంగా 4.38 నిమిషాల నిడివితో ట్రైలర్ కట్ చేసారు టాక్సిక్ మేకర్స్. అంతపెద్ద ట్రైలర్ ఇచ్చినా కథను మాత్రం రివీల్ చేయలేదు. యశ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే తారా సుతారియా, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, కియారా అద్వానీ అందరి పాత్రలను ట్రైలర్‌లో పరిచయం చేసారు. టాక్సిక్ ట్రైలర్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మేకింగ్ అండ్ మ్యూజిక్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ సినిమాను సిద్ధం చేసారు గీతూ మోహన్ దాస్. ఆ విజువల్స్, రిచ్ నెస్, సినిమాటోగ్రఫీ అన్నీ టాప్ నాచ్‌లో ఉన్నాయి. వైలెన్స్, రొమాన్స్ విషయంలోనూ హాలీవుడ్ సినిమాలకు ధీటుగానే వెళ్లారు మేకర్స్. మొత్తానికి చూడాలిక.. ఆగస్ట్ 26న బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్ రూలింగ్ ఎలా ఉండబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీమిండియాను కలవరపెడుతున్న వరుస గాయాలు.. రంగంలోకి బీసీసీఐ పెద్దలు!
వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు
సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!